గుజరాత్(Gujarat)లోని సబర్‌కాంత జిల్లా(Sabarkantha District) లో భావేష్ భండారి(Bhavesh Bhandari) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారు. కొన్నాళ్ల కిందట కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి దిగారు. ఆయనకు అదృష్టం కలిసివచ్చింది. వ్యాపారంలో కోట్లకు కోట్లు సంపాదించారు. బోలెడన్ని ఆస్తులను కూడబెట్టుకున్నారు.
గుజరాత్(Gujarat)లోని సబర్‌కాంత జిల్లా(Sabarkantha District) లో భావేష్ భండారి(Bhavesh Bhandari) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నారు. కొన్నాళ్ల కిందట కొద్ది మొత్తం పెట్టుబడితో వ్యాపారంలోకి దిగారు. ఆయనకు అదృష్టం కలిసివచ్చింది. వ్యాపారంలో కోట్లకు కోట్లు సంపాదించారు. బోలెడన్ని ఆస్తులను కూడబెట్టుకున్నారు. కానీ ఆ ఆస్తుపాస్తులు, సంపద, వ్యాపారం ఏవీ భావేష్ భండారికి సంతృప్తినివ్వలేదు. ఆయన భార్యకు కూడా ఇదే రకమైన తలంపు వచ్చింది. ఇప్పటికే సన్యాసం స్వీకరించిన కొడుకు, కూతురు బాటలోనే తాము కూడా పయనించాలని అనుకున్నారు. భావేష్ భండారి దంపతుల 19 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు 2022లో సన్యాసం పుచ్చుకున్నారు. తమ పిల్లల్లాగే తాము కూడా భౌతిక అనుబంధాలను త్యజించాలనుకున్నారు. సన్యాసం పుచ్చుకోవడానికి సంసిద్ధులయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ వేడుకలో భావేష్ భండారి, అతడి భార్య తమ సంపద మొత్తాన్ని (200 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది) విరాళంగా ఇచ్చేశారు. ఈ నెల 22వ తేదీన జరిగే కార్యక్రమంలో వీరిద్దరు అధికారికంగా సన్యాసం తీసుకోనున్నారు. ఆ రోజున భండారి దంపతులు మరో 35 మందితో కలిసి నాలుగు కిలోమీటర్లు ఊరేగింపుగా బయలుదేరనున్నారు. అక్కడ తమ యావదాస్తులను వదిలేయబోతున్నారు. తర్వాత రెండు తెల్లని వస్త్రాలను ధరిస్తారు. దేశం అంతటా చెప్పులు లేకుండా తిరుగుతారు. భిక్షతో మాత్రమే జీవిస్తారు.