ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో ఉంచుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. కానీ కేంద్రమంత్రి పర్షోత్తమ్‌ రూపాలా(Parshottam Rupala) మాత్రం నోరుజారారు. క్షత్రియులపై(Kshatriya) ఆయన చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌(Gujarat) బీజేపీకి(BJP) తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రూపాలా చేసిన వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో(Rajkot) రాజ్‌పుత్‌(Rajputh) వర్గానికి చెందిన వారు ఆందోళనలకు దిగారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ నోళ్లను అదుపులో ఉంచుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి. కానీ కేంద్రమంత్రి పర్షోత్తమ్‌ రూపాలా(Parshottam Rupala) మాత్రం నోరుజారారు. క్షత్రియులపై(Kshatriya) ఆయన చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌(Gujarat) బీజేపీకి(BJP) తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. రూపాలా చేసిన వ్యాఖ్యలతో రాజ్‌కోట్‌లో(Rajkot) రాజ్‌పుత్‌(Rajputh) వర్గానికి చెందిన వారు ఆందోళనలకు దిగారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎందుకైనా మంచిదని పోలీసులు రూపాల ఇంటి దగ్గర భద్రత పెంచారు. క్షత్రియులపై తాను చేసిన వ్యాఖ్యాలపై రూపాల ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. కానీ రాజ్‌పుత్‌లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాజ్‌కోట్‌ లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న రూపాలను తప్పించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. మార్చి 22వ తేదీన దళితులతో జరిగిన ఓ కార్యక్రమంలో రూపాల మహారాజులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్‌ వారితో కలిసి ఒకే కంచంలో తిన్నారని, తెల్లవారికి తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేశారని అన్నారు. బ్రిటిష్‌ వారి వేధింపులను దళితులు తట్టుకుని నిలబడగలిగారని, ఎంత వేధించినా వారు మతం మాత్రం మారలేదని చెప్ఆరు. రూపాల చేసిన వ్యాఖ్యలు గుజరాత్‌లో పెద్ద దుమారం రేపాయి. అక్కడ రాజ్‌పుత్‌ వర్గం ఓట్లు బీజేపీలో 17 శాతం వరకు ఉంటాయి. నిన్న మొన్నటి వరకు ఇవన్నీ బీజేపీ ఓట్లే. రూపాల వ్యాఖ్యల తర్వాత వారు మనసు మార్చుకున్నారు.

Updated On 3 April 2024 6:07 AM GMT
Ehatv

Ehatv

Next Story