అత్యాచారం(Rape) భయంకరమైన నేరమని గుజరాత్ హైకోర్టు(Gujarat High court) అభిప్రాయపడింది. భర్త చేసినా సరే రేప్ అంటే రేపేనని పేర్కొంది. అది నేరంగానే పరిగణించాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో వైవాహిక అత్యాచారం(Marital rape) చట్టవిరుద్ధమని గుజరాత్ హైకోర్టు వివరించింది. భారత్‌లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది. మహిళల వెంటపడటం, వేధించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం, ఈవ్ టీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగారభరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నది.భర్త తన భార్యపై అత్యాచారానికి పాల్పడినా అది నేరమేనని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి దివ్యేష్ జోషి(Divyesh Joshi) తెలిపారు.
అత్యాచారం(Rape) భయంకరమైన నేరమని గుజరాత్ హైకోర్టు(Gujarat High court) అభిప్రాయపడింది. భర్త చేసినా సరే రేప్ అంటే రేపేనని పేర్కొంది. అది నేరంగానే పరిగణించాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో వైవాహిక అత్యాచారం(Marital rape) చట్టవిరుద్ధమని గుజరాత్ హైకోర్టు వివరించింది. భారత్‌లో మహిళలపై లైంగిక హింసను కప్పిపెడుతున్న నిశ్శబ్ధాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నదని ఉద్ఘాటించింది. మహిళల వెంటపడటం, వేధించడం, దుర్భాషలాడటం, భౌతిక దాడికి పాల్పడటం, ఈవ్ టీజింగ్ లాంటి దుశ్చర్యలను శృంగారభరితమైనవిగా చూపుతూ సినిమాల ద్వారా ప్రచారం చేయడం తీవ్ర విచారకరమని పేర్కొన్నది.భర్త తన భార్యపై అత్యాచారానికి పాల్పడినా అది నేరమేనని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి దివ్యేష్ జోషి(Divyesh Joshi) తెలిపారు. అమెరికాలోని 50 రాష్ట్రాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, స్వీడన్, డెన్మార్క్, నార్వే, సోవియట్ యూనియన్, పోలాండ్, చెకోస్లోవేకియా తదితర మూడు రాష్ట్రాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధమని డిసెంబర్ 8వ తేదీన తన ఉత్తర్వుల్లో జస్టిస్ జోషి పేర్కొన్నారు. ఈ విషయంలో భర్తలకు(Husband) ఇచ్చే మినహాయింపును బ్రిటన్(Britain) కూడా రద్దు చేసిందన్నారు. రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో సమాన హోదా కల్పించిందని చెబుతూ వివాహాన్ని సమానుల కలయికగా పరిగణిస్తోందన్నారు. మహిళలపై హింసను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో మహిళలపై జరుగుతున్న వాస్తవ ఘటనలు వెల్లడైన గణాంకాల కంటే చాలా ఎక్కువని జస్టిస్ దివ్యేష్ జోషి అన్నారు. డబ్బు కోసం అశ్లీల వెబ్‌సైట్లలో వీడియోలను పోస్టు చేసేందుకు కోడలి పట్ల క్రూరంగా వ్యవహరించిన అత్తకు రెగ్యులర్ బెయిల్(Regular Bail) ఇచ్చేందుకు నిరాకరిస్తూ జస్టిస్ దివ్యేష్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె కోడలి పట్ల దారుణంగా వ్యహరించేది. బెదిరింపులకు గురి చేసేది. తన భర్త, కుమారుడితో ఆమెపై అత్యాచారం జరిపించి నగ్నం చిత్రీకరించేది. ఈ నేరాలపై ఆమెను అరెస్ట్ చేశారు.
నేరంలో ఆమెది సమాన పాత్ర కాబట్టే బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.