దేశంలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న మతోన్మాదులకు గుజరాత్‌ హైకోర్టు(Gujarat High Court) చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. ముస్లింల(Muslims) నమాజ్(Namaz) పిలుపుగా భావించే అజాన్‌కు(Azan) వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(Public interest litigation) కొట్టిపారేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అజాన్ అనేది నమాజ్‌కు ఆహ్వానం పలికే పిలుపు.

దేశంలో ఉద్దేశపూర్వకంగా విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న మతోన్మాదులకు గుజరాత్‌ హైకోర్టు(Gujarat High Court) చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చింది. ముస్లింల(Muslims) నమాజ్(Namaz) పిలుపుగా భావించే అజాన్‌కు(Azan) వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(Public interest litigation) కొట్టిపారేసింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అజాన్ అనేది నమాజ్‌కు ఆహ్వానం పలికే పిలుపు. ప్రతి మసీదు నుంచి రోజుకు అయిదుసార్లు ఈ పిలుపు వస్తుంది. దీనిపై నిషేధం విధించాలని ధర్మేంద్ర ప్రజాపతి అనే డాక్టర్‌ పిల్‌ దాఖలు చేశాడు. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్ల(Loud Speakers) కారణంగా డిస్ట్రబెన్స్‌, శబ్ద కాలుష్యం(Sound Pollution) కలుగుతున్నాయన్నది ధర్మేంద్ర ప్రజాపతి వాదన. ఈయన పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్ల నుంచి రోజుకు అయిదుసార్లు వచ్చే అజాన్‌లో ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదని స్పష్టం చేసింది. గుజరాత్ హైకోర్టు చీఫ్‌ జస్టిస్ సునీతా అగర్వాల్(Sunitha Aggarwal), జస్టిస్ అనిరుద్ధ మయీ(Anirudh Mayi) నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిల్‌ను విచారించింది. లౌడ్ స్పీకర్ ద్వారా వచ్చే మనిషి స్వరం ఏ విధంగా శబ్దకాలుష్యాన్ని కలిగిస్తుందో, ఎన్ని డెసిబుల్స్‌ ఉంటుందో వివరించడంలో పిటిషనర్‌ విఫలమయ్యాడని కోర్టు భావించింది. ఏ ప్రాతిపదికన పిటీషనర్ శబ్ద కాలుష్యమైందని భావిస్తున్నాడో చెప్పాలని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. మీరు ఆలయాలలో(Temples) హారతులు ఇచ్చేటప్పుడు మ్యూజిక్‌ ప్లే చేస్తుంటారు. అది డిస్ట్రబెన్స్‌ కాదా అని చీఫ్ జస్టిస్‌ సునీతా అగర్వాల్‌ సూటిగా ప్రశ్నించారు. దానికి పిటిషన్‌ తరఫు న్యాయవాది .. అజాన్‌లా అయిదుసార్లు కాకుండా హారతి ఒక్కసారే ఇస్తారని, అది కూడా ఇంట్లోనేనని బదులిచ్చారు. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి 'బాగుంది..నేను అడుగుతున్నది ఇంట్లో ఇచ్చే హారతి గురించి కాదు.. ఆలయాలలో ఇచ్చే హారతి గురించి. ఉదయమే హారతి ఇస్తున్నప్పుడు డ్రమ్స్‌ వాయిస్తారు. గంటలు కొడతారు..మరి వీటి వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడదా? ఇది డిస్ట్రబెన్స్‌ కాదా? ఈ శబ్దాలు కేవలం ఆలయ ప్రాంగాణానికే పరిమితమవుతుందా? బయట వినిపించదా' అని తిరిగి ప్రశ్నించారు. ఆలయాలలో భజనలు చేస్తారు. చప్పట్లు కొడతారు. హారతి ఇచ్చేటప్పుడు డోలు వాయిస్తారు. పెద్దపెట్టున గంటలు కొడతారు. లౌడ్‌ స్పీకర్లతో మ్యూజిక్‌ ప్లే చేస్తారు. ఇవి డిస్ట్రబెన్స్‌ కలిగించవా? అజాన్‌ ఎలా ఇబ్బంది కలిగిస్తుంది? రోజంతా కలిపి, అంటే 24 గంటల్లో పట్టుమని పది నిమిషాలు కూడా ఉండని అజాన్‌ ఎలా డిస్ట్రబెన్స్‌ కలిగిస్తుందో చెప్పాలని సునీతా అగర్వాల్‌ అడిగారు. అజాన్ ఇచ్చేటప్పుడు ఎన్ని డెసిబుల్స్ ధ్వని దాటుతుందో లెక్కగట్టారా అని అడిగారు. పెద్దఎత్తున శబ్ద కాలుష్యం చేసే డీజే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు . ఇలాంటి పిల్స్ ను తాము ఎంటర్‌టైన్ చేయమని, అజాన్ అనేది ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఓ విశ్వాసం. అది కూడా రోజంతా కలిపి 10 నిమిషాలు కూడా ఉండదు' అని చీఫ్‌ జస్టిస్ వ్యాఖ్యానించారు. కేవలం వివిధ సామాజిక, మతపరమైన ప్రజలుండే ప్రాంతంలో లౌడ్ స్పీకర్లతో వచ్చే అజాన్ తమకేదో ఇబ్బంది కలిగిస్తుందని భావించే పిటిషనర్‌ పిల్‌ దాఖలు చేసినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. శాస్త్రీయత లేకుండా, ఎంత డెసిబుల్స్ ధ్వని కాలుష్యం అవుతుందో తేల్చకుండా రోజుకు పది నిమిషాలు కూడా ఉండని ఆజాన్‌కు వ్యతిరేకంగా పిల్ వేయడం మంచిది కాదని హితవు చెప్పింది. ఈ పిల్‌ను కొట్టివేసింది.

Updated On 29 Nov 2023 10:44 PM GMT
Ehatv

Ehatv

Next Story