రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి గుజరాత్‌లో(Gujarat) మద్య(Alcohol) నిషేధం ఉంది. 1960 నుంచి అమలులో ఉన్న ఈ నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. గాంధీనగర్‌లో(Gandhi Nagar) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ (GIFT city)లో మద్యం అందుబాటులో ఉంటుంది.
రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి గుజరాత్‌లో(Gujarat) మద్య(Alcohol) నిషేధం ఉంది. 1960 నుంచి అమలులో ఉన్న ఈ నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు తీసుకొచ్చింది. గాంధీనగర్‌లో(Gandhi Nagar) ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ టెక్ సిటీ (GIFT city)లో మద్యం అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని గుజరాత్ ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇంత కాలం మద్య నిషేధం అమలు చేసిన ప్రభుత్వం హఠాత్తుగా గిఫ్ట్ సిటీలో లిక్కర్ అమ్మకాలు అనుమతించడానికి కారణాలున్నాయి. భారీగా పన్ను రాయితీలున్న అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం కావడంతో ఇక్కడ చాలా దేశీయ, విదేశ కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తాయి. ఈ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులకు లిక్కర్ అమ్మేందుకు తాత్కాలిక ప్రాతిపదికన హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులకు అనుమతి ఇచ్చారు. సింగపూర్ లాంటి గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ కేంద్రాలతో పోటీ పడి ఆర్థిక సేవల రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసింది. మరి పెట్టుబడులను ఆకర్షించేందుకు, అతిథులను ఆకట్టుకోవడానికి ఈ మాత్రం చేయాలి మరి! అన్నట్టు పేరుకే మద్య నిషేధం కానీ గుజరాత్‌లో మద్యం ఈజీగా దొరుకుతుందట!