గుజరాత్‌లోని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్డా రామమందిరం పట్ల పార్టీ అనుసరిస్తున్న తీరుతో కలత చెంది అసెంబ్లీ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు.
గుజరాత్(Gujarat)లోని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్డా(CJ Chavda) రామమందిరం(Rama Mandir) పట్ల పార్టీ అనుసరిస్తున్న తీరుతో కలత చెంది అసెంబ్లీ సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా(Resign) చేశారు. విజాపూర్ నియోజకవర్గం(Vijapur constituency) నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. శనివారం ఉదయం గాంధీనగర్‌లో స్పీకర్ శంకర్ చౌదరి(Speaker Shankar Chowdhary)కి రాజీనామా సమర్పించినట్లు రాష్ట్ర అసెంబ్లీ అధికారి తెలిపారు.
కాంగ్రెస్‌కు(Congress) రాజీనామా చేయడంపై సీజే చావడా మాట్లాడుతూ.. ‘నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను.. 25 ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేశాను.. రామమందిరం వద్ద ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించడం వల్ల దేశమంతా ఆనందంగా ఉంది. ప్రజల ఆనందోత్సాహంలో భాగం కాకుండా కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానమే కలత చెందడానికి కారణమని పేర్కొన్నాడు.
"ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) వంటి ఇద్దరు పెద్ద నాయకుల పనులు, విధానాలకు మేము మద్దతు ఇవ్వాలి. నేను కాంగ్రెస్‌లో ఉన్నందువల్ల అలా చేయలేకపోయాను. అందుకే, నేను రాజీనామా చేసాను" అన్నారాయన. చావ్డా రాజీనామాతో 182 మంది సభ్యుల గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యుల సంఖ్య ఇప్పుడు 15 కి చేరుకుంది. చావ్డా బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. అయితే ఇంకా నిర్ధారణ లేదు.