గుజరాత్‌లో(Gujarat) అనుమానిత ఉగ్రవాదులు(Terrorist) పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Internation airport) నలుగురు ఐఎస్‌ఐఎస్(ISIS) అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఈ నలుగురు శ్రీలంకకు(Sri lanka) చెందిన వారని అధికారులు చెబుతున్నారు.
గుజరాత్‌లో(Gujarat) అనుమానిత ఉగ్రవాదులు(Terrorist) పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్‌పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Internation airport) నలుగురు ఐఎస్‌ఐఎస్(ISIS) అనుమానిత ఉగ్రవాదులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది. ఈ నలుగురు శ్రీలంకకు(Sri lanka) చెందిన వారని అధికారులు చెబుతున్నారు. వీరిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు విమానాశ్రయానికి రావడానికి వెనక ఉన్న ఉద్దేశం ఏమిటనే విషయం ఇంకా తెలియ లేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయం అంతటా భద్రతను పెంచారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో మూడు ఐపీఎల్ జట్లు విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది మార్చిలో భారత్ లోని ఇద్దరు ఐసిస్ అగ్ర నేతలను అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్‌లో నివాసం ఉంటున్న ఐఎస్‌ఐఎస్ కార్యకర్తలు హరీష్ అజ్మల్ ఫరూఖీ, హర్యానా లోని పానిపట్‌కు చెందిన అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్‌గా గుర్తించారు. వీరు ఉగ్రవాద కార్య కలాపాలకు నిధులు సమకూర్చడం, పేలుడు పదార్థాలను సరఫరా చేయడం, ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించడం వంటి వాటిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అధికారులు తెలిపారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ప్రకారం వీరిద్దరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిల్లీ, లఖ్‌నవూల్లో పలు కేసులు నమోదు చేసింది..