కొందరికి పైసలంటే లెక్కలేకుండా పోతోంది. చిత్తు కాగితాల్లా నోట్లను విసిరేస్తున్నారు.
కొందరికి పైసలంటే లెక్కలేకుండా పోతోంది. చిత్తు కాగితాల్లా నోట్లను విసిరేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్‌లో ఇలాగే కొందరు ప్రవర్తించారు. పెళ్లికి వచ్చిన అతిథులపై నోట్లను విసిరేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడి బంధువులు కొందరు ఇళ్లు, జేసీబీల మీదకెక్కి అక్కడున్న జనాలపై నోట్ల వర్షం కురిపించారు. ఇందులో 100 రూపాయల నోట్లున్నాయి. రెండు వందల రూపాయల నోట్లు ఉన్నాయి. 500 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. ఇలా వారు విసిరేసిన సొమ్ము మొత్తం 20 లక్షల రూపాయలకు పైనే ఉంటుంది. గాలిలో ఎగురుతున్న నోట్లను సొంతం చేసుకోవడం కోసం ప్రజలు ఎగబడ్డారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా రియాక్టవుతున్నారు. అవసరం ఉన్నవారికి ఈ డబ్బు ఇస్తే పుణ్యమైనా దక్కేది అని కొందరు, ఈ డబ్బుతో నలుగురు పేద అమ్మాయిలకు పెళ్లి చేయవచ్చు అని మరికొందరు, ఇన్‌కమ్‌టాక్స్ వారికి ఫోన్ చేసి ఉండాల్సిందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.