GST Revenue Collections : సెప్టెంబర్‌లో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు
దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు సెప్టెంబర్‌లో(September) వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగాయి. సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 1.62 లక్షల కోట్లకు పైగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లు నాలుగోసారి రూ.1.6 లక్షల కోట్ల మార్కును దాటాయి.

గత నెలలో స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,62,712 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.29,818 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.37,657 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతులపై జమ చేసిన రూ. 41,145 కోట్లతో కలిపి), సెస్ రూ.11,613 కోట్లు (వస్తువుల దిగుమతిపై జమ చేసిన రూ. 881 కోట్లతో కలిపి) ఉన్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. 2023 సెప్టెంబర్ GST వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్ వసూళ్ల కంటే 10 శాతం ఎక్కువ. గతేడాది సెప్టెంబర్ జీఎస్టీ వసూళ్లు రూ. 1.47 లక్షల కోట్లు. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతితో సహా) ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి.