ప్రస్తుతం పెళ్లి విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా, స్వీట్ మెమోరిలా మార్చుకోవడానికి ఎలాంటి ఛాన్సును వదులుకోవడంలేదు. బీహార్(Bihar)లోని సమస్తిపూర్‌లో ఇలాంటి ఓ వింత ఐడియానే పెళ్లికొడుకుకి వచ్చింది.
బీహార్ (Bihar)లోని ఓ వ్యక్తి తన పెళ్లి కారును డెకరేషన్ ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. కానీ అతని చేతిలో డబ్బుల్లేవ్... కానీ కారుకి డెకరేషన్ (decoration)చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉంది.. తన పెళ్లికి కారు డెకరేషన్ లేకపోతే బాగుండదనిపించింది.. ఓ వైపు జేబు చూస్తే ఖాళీ.. పెళ్లిమండపమేమో దూరం.. మరోవైపు చుట్టూ ఉన్నవాళ్లంతా ఎగతాళి చేస్తారేమోనని భయం.. అయితే బ్రెయిన్ నిండా ఐడియాలున్నాయ్.. అందులో నుంచి ఓ వింత ఐడియా తలపు తట్టింది.. వెంటనే అమలు చేసేశాడు.. కారు డెకరేషన్(decorate)ను చూసిన ప్రజలు ఫస్ట్ షాక్ (shocked)అయ్యారు.. ఆ తర్వాత ఐడియాను మెచ్చుకున్నారు.. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ అవుతోంది. మరి తెగ వైరల్ అవుతోన్న ఈ న్యూస్ ఏంటో తెలుసుకుందాం.
ప్రస్తుతం పెళ్లి విషయంలో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని ప్రత్యేకంగా, స్వీట్ మెమోరిలా మార్చుకోవడానికి ఎలాంటి ఛాన్సును వదులుకోవడంలేదు. బీహార్(Bihar)లోని సమస్తిపూర్‌లో ఇలాంటి ఓ వింత ఐడియానే పెళ్లికొడుకుకి వచ్చింది. తన పెళ్లి ఊరేగింపులో కుర్‌కురేతో(Kurkure) అలంకరించిన కారుతో వచ్చాడు. ఈ కారును చూసి జనం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారిలో కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
సమస్తిపూర్ జిల్లా సరైరంజన్ బ్లాక్ అహ్మద్‌పూర్ గ్రామానికి చెందిన రామ్ శోభిత్(Ram Shobhit)రామ్ కుమారుడు రాజేష్ రామ్ వివాహం జరిగింది. ఈ సందర్భంగా పెళ్లికొడుకు కారును డెకరేట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది..పెళ్లికొడుకు తన స్నేహితులతో కలిసి మార్కెట్‌లోని పూల షాపులకు చేరుకున్నాడు. అయితే డెకరేషన్ చేయాడానికి పూలను కొనడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.. అంత డబ్బులు లేకపోవడంతో కుర్‌కురేతో డెకరేట్ చేయమని స్నేహితులు సరదాగా అన్నారు. అయితే అది సీరియస్ గా తీసుకున్న పెళ్లికొడుకు , పెళ్లికి వచ్చిన బంధువుల పిల్లలు అందరు కలిసి కుర్‌కురేతోనే కారును డెకరేట్ చేసేశారు. కుర్‌కురేతో చేసిన కారు డెకరేషన్ చూసిన జనం మొదట ఆశ్చర్యపోయిన ... ఆ తర్వాత ఈ ఐడియా ఏదో బావుంది...అంటూ పెళ్లి కొడుకుని తెగ మెచ్చుకున్నారట.