ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హత్రాస్(Hatras) జిల్లాలో జరిగిన వివాహ వేడుకలో(Marriage Celebrations) పెళ్లికి ముందు రోజు వరుడు మృతి(Groom) చెందడం విషాదకరంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) హత్రాస్(Hatras) జిల్లాలో జరిగిన వివాహ వేడుకలో(Marriage Celebrations) పెళ్లికి ముందు రోజు వరుడు మృతి(Groom) చెందడం విషాదకరంగా మారింది. ఈ సంఘటన భోజ్‌పూర్(Bhojpur) గ్రామంలో జరిగింది. పెళ్లి వేడుకల సందర్భంగా డ్యాన్స్ చేస్తూ 22 ఏళ్ల పెళ్లికొడుకు శివం నేలపై కుప్పకూలి తన పెళ్లికి ముందు రోజు రాత్రి మరణించాడు. శివమ్ కుమార్ తన ఇంట్లో జరిగిన "భరాత్" వేడుకలో(bharath celebrations) డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా పడిపోయాడు. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. శివం మృతికి గుండెపోటు కారణమని వైద్యులు తెలిపారు. తమ సోదరుడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలతో బయటపడలేదని శివమ్ తమ్ముడు రచిత్‌కుమార్ (18) తెలిపారు. తమ తల్లి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతోందని.. తన చికిత్స ఖర్చులు, ఇంటి ఖర్చులన్నీ తన అన్నే చూశాడని మృతుడి తమ్ముడు తెలిపాడు. శివం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో కంప్యూటర్ టీచర్‌గా పనిచేసేవాడు. ఆగ్రాకు చెందిన మోహినితో సోమవారం వివాహం జరగనుండగా.. అదే రోజు అతని అంత్యక్రియలు జరగడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మోహిని కుటుంబ సభ్యులు కూడా శివమ్ దహన సంస్కారాలకు హాజరయ్యారు.