కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు జరపాలని నిర్ణయించింది. 2025లో జనగణన మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు జరపాలని నిర్ణయించింది. 2025లో జనగణన మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2026 వరకు జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని పేర్కొన్నాయి. ఆ తర్వాత లోక్‌సభ స్థానాల(Lok Sabha Seat) విభజన ప్రక్రియ ఉంటుందని, అది 2028కి ముగుస్తుందని చెప్పాయి.

ఈ ప్రక్రియ 2025లో ప్రారంభం అవుతుందని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఇది 2026 వరకూ కొనసాగనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని తెలిపాయి. అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి. జనగణన పూర్తి కావడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జనాభాలో చైనా(China)ను భారతదేశం(India) దాటిపోయిందన్న విషయం తెలిసిందే. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జనగణనను పట్టించుకోలేదు. ప్రభుత్వం వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. జనగణన జరగకపోవడం వల్ల ఆర్థిక డాటా, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ లెక్కలన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావడం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని వారు అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ehatv

ehatv

Next Story