బీజేపీ(BJP) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కాషాయీకరణకు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే చరిత్ర పాఠాలను మార్చేసింది. రహదారుల నామకరణాలు మార్చేసింది. కొన్ని నగరాల పేర్లకు బదులు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంది.

DD News Channel
బీజేపీ(BJP) సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దేశాన్ని కాషాయీకరణకు కంకణం కట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే చరిత్ర పాఠాలను మార్చేసింది. రహదారుల నామకరణాలు మార్చేసింది. కొన్ని నగరాల పేర్లకు బదులు తమకు నచ్చిన పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు దూరదర్శన్ మీద పడింది. వార్తలను ప్రసారం చేసే దూరదర్శన్(Doordarshan) న్యూస్ ఛానెల్ లోగో(Logo) రంగును కాషాయరంగలోకి మార్చేసింది. లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయరంగంలోకి మార్చడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 'సుదీర్ఘ చరిత్ర ఉన్న దూరదర్శన్ న్యూస్ లోగో కాషాయరంగులోకి మారిపోయింది. ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి’ అని ఇంతకు ముందు దూరదర్శన్ సీఈవోగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించారు. దూరదర్శన్ చర్య మత ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిట్టిపోశారు.
