ప్రభత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరచుగా డుమ్మా కొడుతున్నారు. రిజిస్టర్ లో సంతకం పెట్టి చెక్కేస్తున్నారు.

ప్రభత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తరచుగా డుమ్మా కొడుతున్నారు. రిజిస్టర్ లో సంతకం పెట్టి చెక్కేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫొటోలను స్కూల్ లో ప్రదర్శించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నర్సింహారెడ్డి డీఈవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర్వులు వంద శాతం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలాన్నారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండానే హాజరు చూపుతూ వేతనం తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని , మరికొందరైతే ఏకంగా ఏళ్ల తరబడి కూడా విధులకు హాజరుకాని ఉదంతాలు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో సదరు పాఠశాలలో ఎవరెవరు పని చేస్తున్నారో వారి ఫొటోలను పదర్శిస్తే స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ర్టాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. మరోవైపు తమ వద్ద క్వాలిఫైడ్‌ టీచర్లు పని చేస్తున్నట్టు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరాలు ఇస్తున్నాయి. కానీ చాలా పాఠశాలలు అర్హతలు లేని వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నాయని, ప్రైవేటు స్కూళ్లలోనూ టీచర్ల ఫొటోలు ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ehatv

ehatv

Next Story