మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, ముంబాయి(Mumbai) బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతడి కుటుంబసభ్యులకు చెందిన నాలుగు ప్రాపర్టీలు(Properties), వ్యవసాయభూమి ముంబాకే గ్రామంలో ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే శుక్రవారం వేలం జరగనుంది. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్‌ ఇబ్రహీం(Dawood Ibrahim) ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్ట్‌, ముంబాయి(Mumbai) బాంబు పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించిన చిన్ననాటి ఇల్లు, మరికొన్ని ప్రాపర్టీలను అధికారులు వేలం వేయనున్నారు. అతడి కుటుంబసభ్యులకు చెందిన నాలుగు ప్రాపర్టీలు(Properties), వ్యవసాయభూమి ముంబాకే గ్రామంలో ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి పరిధిలో ఉన్న ఈ గ్రామంలోనే శుక్రవారం వేలం జరగనుంది. స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్ (ఆస్తి జప్తు) చట్టం, 1976 కింద దావూద్‌ ఇబ్రహీం(Dawood Ibrahim) ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిలో కొన్నింటిని జనవరి 5వ తేదీన అధికారులు వేలం వేయనున్నారు. గత తొమ్మిదేళ్లలో దావూద్‌ ఇబ్రహీం, అతడి కుటుంబానికి చెందిన 11 ఆస్తులను అధికారులు వేలం వేశారు. వీటిల్లో ఒక రెస్టారెంట్‌ (4.53 కోట్ల రూపాయలు), ఆరు ఫ్లాట్లు (3.53 కోట్ల రూపాయలు), గెస్ట్‌ హౌస్‌ (3.52 కోట్ల రూపాయలు) అమ్ముడయ్యాయి. వీటిద్వారా 12 కోట్ల రూపాయలు సమీకరించినట్టు అధికారులు తెలిపారు. 1993 ముంబాయి బాంబు పేలుళ్లలో సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం 1983లో ముంబైకి రాకముందు ముంబాకే గ్రామంలో ఉండేవాడు. అయితే ముంబాయి పేలుళ్ల తర్వాత భారత్‌ విడిచి పాకిస్తాన్‌(Pakistan) పారిపోయాడు. ఈ పేలుళ్లలో 257 మంది చనిపోయారు. అమెరికాతో(America) పాటు ఐక్యరాజ్యసమితి కూడా దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల దావూద్‌ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా మారిందని, అతనికి విషప్రయోగం జరిగి ఆస్పత్రిలో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదని రెండు నిఘా వర్గాలు తేల్చాయి.

Updated On 2 Jan 2024 2:34 AM GMT
Ehatv

Ehatv

Next Story