పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవడానికి ఏమీ లేక బీజేపీ(BJP) ఎప్పటిలాగే మతాన్ని నమ్ముకుంది. రామమందిరం(Ram mandir) పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతోంది. అదే సమయంలో ముస్లింలపై విద్వేషం చిమ్ముతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీలాగే(PM Narendra modi) ఆయన అనుచరులు కూడా మాట్లాడుతున్నారు. గోషామహల్(Goshmahal) ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) నల్లగొండలో ఇలాగే మాట్లాడారు.

MLA Raja Singh
పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పుకోవడానికి ఏమీ లేక బీజేపీ(BJP) ఎప్పటిలాగే మతాన్ని నమ్ముకుంది. రామమందిరం(Ram mandir) పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతోంది. అదే సమయంలో ముస్లింలపై విద్వేషం చిమ్ముతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీలాగే(PM Narendra modi) ఆయన అనుచరులు కూడా మాట్లాడుతున్నారు. గోషామహల్(Goshmahal) ఎమ్మెల్యే రాజాసింగ్(Rajasingh) నల్లగొండలో ఇలాగే మాట్లాడారు. దేశంలో హిందూ జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే విషయమని, హిందూ జనాభా తగ్గితే భారతదేశం మత ప్రతిపాదికన ముక్కలయ్యే ప్రమాదం ఉందని రాజాసింగ్ హెచ్చరించారు. నరేంద్రమోదీ(Marendra modi) సర్కారును మూడోసారి గెలిపించుకుంటే మత ఆధారిన జనాభా నియంత్రణ కోసం కొత్త చట్టం వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. దేశంలో 1950 నుంచి 2015 వరకు మత ఆధారిత జనాభా పెరుగుదలపై ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చేసిన పరిశోధన అంశాలను ప్రస్తావించారు. హిందూ జనాభా 7.3 శాతం తగ్గిందని, ముస్లిం జనాభా మాత్రం 43 శాతం పెరిగిందని రాజాసింగ్ చెప్పారు. ఇదే విధంగా హిందూ జనాభా తగ్గుతూ వెళితే భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఇది మంచి సంకేతం కాదన్నారు.
