ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. హత్యకు గురయ్యారని అనుకుంటున్న అక్కాచెల్లెళ్లు తిరిగి వచ్చారు. తిరిగిరావడానికి కారణం తమ కారణంగా ఓ నిర్దోషికి శిక్షపడుతుందేమేమోనని! గోరఖ్‌పూర్‌కు చెందిన గీత (21), సీత (20) అక్కాచెల్లెళ్లు. ఏడాది కిందట వీరిద్దరూ కనిపించకుండా పోయారు. చాన్నాళ్లు వెతికారు.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. హత్యకు గురయ్యారని అనుకుంటున్న అక్కాచెల్లెళ్లు తిరిగి వచ్చారు. తిరిగిరావడానికి కారణం తమ కారణంగా ఓ నిర్దోషికి శిక్షపడుతుందేమేమోనని! గోరఖ్‌పూర్‌కు చెందిన గీత (21), సీత (20) అక్కాచెల్లెళ్లు. ఏడాది కిందట వీరిద్దరూ కనిపించకుండా పోయారు. చాన్నాళ్లు వెతికారు. ఆచూకి దొరక్కపోయేసరికి వారిని హత్య చేసి ఉండవచ్చని కుటుంబసభ్యులు అనుకున్నారు. వారి సోదరుడు అజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారితో జయనాథ్ మౌర్య అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అతడే వారిద్దరినిహత్య చేసి ఉంటాడని పోలీసులకు చెప్పాడు. పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. వారికి జయనాథ్ మౌర్యనే హత్య చేశాడనడానికి ఆధారాలు లభించకపోయేసరికి కేసు నమోదు చేయలేదు. దాంతో అజయ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సంవత్సర తర్వాత జనవరి 8, 2024న కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో గోరఖ్‌పూర్‌లోని బెల్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లో జయనాథ్‌పై హత్య కేసు నమోదయ్యింది. నాలుగు నెలల విచారణలో ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారని, ప్రేమించినవారి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయారని పోలీసులు గుర్తించారు. తమ సోదరుడు పెట్టిన హత్య కేసు గురించి తెలుసుకున్న గీత, సీతలు నిర్దోషికి శిక్ష పడకూడదని అనుకున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. హర్యానాకు చెందిన విజేందర్‌ను సీత పెళ్లి చేసుకుంది. వీరికి అయిదు నెలల కూతురు కూడా ఉంది. తాను అతడితో కలిసి జీవిస్తున్నానని పోలీసులకు తెలిపింది. ఇక ఉత్తరాఖండ్‌లోని అల్మోరాకు చెందిన సురేశ్ రామన్‌ను గీత పెళ్లి చేసుకుంది. వీరికి ఆరు నెలల కూతురు ఉంది. చనిపోయారని అనుకున్న అక్కాచెల్లెళ్లు తిరిగి రావడంతో కుటుంబసభ్యులతో పాటు జయ్‌నాథ్ కూడా ఆనందపడుతున్నారు.