గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ (Google India Digital Services), ఇంటర్నేషనల్ పేమెంట్స్(International Payments), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇతర దేశాల్లో UPIని విస్తరించడానికి ఎంవోయూ(MOU) కుదుర్చుకున్నాయి.

Google Pay

ఇతర దేశాలకు వెళ్లినప్పుడు UPI చెల్లింపుల వినియోగాన్ని విస్తృతం చేయడానికి, విదేశాలలో సౌకర్యవంతంగా లావాదేవీలు చేసేందుకు వీలు కల్పించారు. భారతీయులు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు గూగుల్ పే సేవలను సులభంగా వినియోగించుకోవచ్చు. దీంతో ఆయా దేశాల కరెన్సీని వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. గతంలో మాదిరిగా విదేశాల్లో పేమెంట్లకు విదేశీ కరెన్సీ, క్రెడిట్, ఫారెక్స్ కార్డ్‌లపై మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. అలాగే గూగుల్ పే(Google Pay) ద్వారా విదేశాల నుంచి కూడా నగదు బదిలీ ఈజీ అవుతుందని గూగుల్ డిజిటల్ సర్వీసెస్ ప్రకటించింది. 2023లో UPI జీపే ద్వారా జరిగిన లావాదేవీలు రూ. 167 లక్షల కోట్లని ఆ సంస్థ తెలిపింది.