గూగుల్(Google) మరోసారి ప్లే స్టోర్(Play store) నుంచి పలు యాప్‌లను(Applications) తొలగించింది. ఏప్రిల్ 2021, జూలై 2022 మధ్య 3500 నుండి 4000 యాప్‌లను సమీక్షించి వాటిపై చర్యలు తీసుకుంది. ఆర్థిక మోసాల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు గూగుల్ ఎప్పటికప్పుడు ప్లేస్టోరో నుంచి నకిలీ యాప్‌లను(Fake APPs) తొలగిస్తుంది. ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న నకిలీ లోన్ యాప్‌లపై గూగుల్ మరోసారి కఠిన చర్యలు తీసుకుంది.

పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్(Bhagwat Karad) ఫేక్ లోన్ యాప్‌లను అరికట్టడానికి ఆర్‌బిఐతో(RBI) ప్రభుత్వం ఎలా పని చేస్తుందో వివరించారు. ఇంతకుముందు, గూగుల్. ఫేక్ లోన్ యాప్స్(Fake Loan apps) పై చర్యలు తీసుకోవడంతోపాటు కంపెనీ తన పాలసీలో కూడా భారీగా మార్పులు చేసింది. ఇప్పుడు ఆ యాప్‌లు మాత్రమే నియంత్రిత ఎంటిటీలు లేదా ఈ ఎంటిటీల సహకారంతో గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రవేశాన్ని పొందుతాయి. అంతేకాకుండా, గూగుల్ ఇప్పుడు అదనపు పాలసీ అవసరాలను కూడా అమలు చేసింది. మనం జాగ్రత్తగా ఉంటేనే ఇంటర్నెట్ సురక్షితంగా ఉంచుతుంది. అజాగ్రత్తగా ఉంటే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో వేల సంఖ్యలో యాప్‌లు ఉన్నాయి. నిజమైన, నకిలీ యాప్‌ల మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టం. అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే,వీటిని గుర్తించవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు, దాని రివ్యూస్‌ను చూడాలంటున్నారు.ఆ యాప్ ఎప్పుడు ప్రారంభించిందో తెలుసుకోవాలని అంతేకాకుండా కొత్త యాప్ డౌన్‌లోడ్ సంఖ్య ఎక్కువగా ఉంటే అది నకిలీ కావచ్చు. ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు యాప్ ఎలాంటి వివరాలను అడుగుతుందో కూడా గమనించాలని చెప్తున్నారు.

Updated On 8 Feb 2024 1:03 AM GMT
Ehatv

Ehatv

Next Story