గూగుల్ మ్యాప్స్‌(Google maps) వచ్చిన తర్వాత అనుకున్న లోకేషన్‌కు వెళ్లడం ఈజీ అయ్యింది. మనకా లోకేషన్‌ తెలియకపోయినా వేలి పట్టుకుని చూపించే మార్గదర్శకురాలయ్యింది గూగుల్‌ మ్యాప్స్‌. ఆ మాటకొస్తే ఈ భూమ్మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేదిప్పుడు. ఫోన్‌ లాక్‌ తీసేసి, డెస్టినేషన్ టైప్‌ చేసి, స్టార్ట్‌ నొక్కడమే తరువాయి మిగతాదంతా గూగుల్‌ మ్యాప్స్‌ చూసుకుంటుంటుంది. ఎవరినీ అడ్రస్‌ అడగాల్సిన పని లేదు.

గూగుల్ మ్యాప్స్‌(Google maps) వచ్చిన తర్వాత అనుకున్న లోకేషన్‌కు వెళ్లడం ఈజీ అయ్యింది. మనకా లోకేషన్‌ తెలియకపోయినా వేలి పట్టుకుని చూపించే మార్గదర్శకురాలయ్యింది గూగుల్‌ మ్యాప్స్‌. ఆ మాటకొస్తే ఈ భూమ్మీద మనకు తెలియని ప్రదేశమంటూ లేదిప్పుడు. ఫోన్‌ లాక్‌ తీసేసి, డెస్టినేషన్ టైప్‌ చేసి, స్టార్ట్‌ నొక్కడమే తరువాయి మిగతాదంతా గూగుల్‌ మ్యాప్స్‌ చూసుకుంటుంటుంది. ఎవరినీ అడ్రస్‌ అడగాల్సిన పని లేదు. అదే మనకు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇక్కడి వరకు ఓకే. కాకపోతే మన ఫోన్‌లు ఓ నిమిషం తర్వాత లాక్‌ అయిపోతాయి కదా! మళ్లీ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయాలంటే ఇబ్బందే కదా! అవును ఇబ్బందే! కాకపోతే ఇకమీదట ఆ ఇబ్బంది ఉండదు లేండి. ఎందుకంటే గూగుల్‌ ఈ సమస్య ఉండకుండా చేసింది. గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికే కస్టమర్లకు ఉపయోగపడే అనేక ఫీచర్లను స్టేజ్‌ బై స్టేజ్‌ ప్రవేశపెడుతూ వస్తోంది. వాట్సప్ అవసరం లేకుండానే రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేరింగ్‌, ఫ్యూయెల్​ సేవింగ్ వంటి ఫీచర్లను తీసుకొచ్చిన గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే(Lock screen) లొకేషన్‌(Location) కనిపించేలా ఏర్పాట్లు చేసింది. ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసి వివరాలను అందిస్తే సమయం, షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఫోన్‌ లాక్‌ అయితే మళ్లీ లాక్‌ తీసి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ (ఎస్టిమేటెడ్‌ టైమ్‌ ఆఫ్‌ అరైవల్‌), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ కనిపిస్తాయి. అంటే ఇకపై గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగించాలంటే ప్రత్యేకంగా ఫోన్‌ లాక్‌ ఓపెన్‌ చేసి ఉంచాల్సిన అవసరం ఉండదన్నమాట! అలాగే, ఏదైనా లొకేషన్‌కు సంబంధించిన వివరాలు ఎంటర్‌ చేయగానే.. స్టార్ట్‌ బటన్‌ క్లిక్‌ చేయకుండానే ప్రివ్యూ కనిపిస్తుంది. ఒకవేళ మీరు వేరే రూట్‌లో ప్రయాణిస్తుంటే.. ఆటోమేటిక్‌గా రూట్‌ అప్‌డేట్‌ అవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌లో గ్లాన్సబుల్‌ ఫీచర్‌ డీఫాల్ట్‌గా ఆఫ్‌లో ఉంటుంది. యాప్‌ ఓపెన్‌ చేసి పైన కుడివైపు కనిపించే మన ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అందులో సెట్టింగ్స్‌ను ఎంచుకొని కిందకు స్క్రోల్‌ చేయగానే నావిగేషన్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కిందకు స్క్రోల్‌ చేస్తే గ్లాన్సబుల్‌ డైరెక్షన్స్‌ వైల్‌ నావిగేటింగ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్‌ చేసుకోవాలి.

Updated On 1 March 2024 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story