Google Wallet : భారతదేశంలోని Android వినియోగదారుల కోసం Google Wallet
గూగుల్(Google) ఎట్టకేలకు భారతీయ మార్కెట్‌లో వాలెట్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ 'గూగుల్ పే' కంటే భిన్నంగా ఉంటుందని అధికారులు తెలిపారు. Google Wallet యాప్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది.
గూగుల్(Google) ఎట్టకేలకు భారతీయ మార్కెట్‌లో వాలెట్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ 'గూగుల్ పే' కంటే భిన్నంగా ఉంటుందని అధికారులు తెలిపారు. Google Wallet యాప్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కాంటాక్ట్‌లెస్ చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది. గూగుల్ భారతదేశంలోని Android వినియోగదారుల కోసం ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌ను మరింతగా పరిచయం చేసింది, కార్డ్‌లు, కీలు, టిక్కెట్లు, పాస్‌లు, ఐడీలను సురక్షితంగా నిల్వ చేయడానికి అవకాశాన్ని ఇందులో చేర్చింది.
Google Payతో పోలిస్తే Google Wallet సేవలు భిన్నంగా ఉంటాయని తెలిపింది. వాలెట్ యాప్‌లో, వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, గిఫ్ట్ కార్డ్‌లు మొదలైనవాటిని డిజిటల్‌గా స్టోర్ చేసుకోవచ్చు. మరోవైపు, Google Pay కేవలం UPI లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. వాలెట్ యాప్ డిజిలాకర్ లాగా ఉంటుంది, ఇది వినియోగదారులకు ఆర్థిక పత్రాలను డిజిటల్‌గా నిల్వ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్లే స్టోర్ నుండి Google Walletని డౌన్‌లోడ్ చేసుకొని.. వినియోగదారులు డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, లాయల్టీ కార్డ్‌లు మరియు గిఫ్ట్ కార్డ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. వాలెట్ ఆటోమేటిక్‌గా ఆండ్రాయిడ్ వినియోగదారుల Gmail ఖాతాకు లింక్ చేయబడుతుంది.