గూగుల్(Google) కంపెనీలో ఉద్యోగాలకు(Employees) కోతలు పెడుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వంద మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ వెల్లడించింది. కాస్ట్ కటింగ్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వాయిస్ బేస్డ్‌తో పాటు ఏ.ఆర్.హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులపై దీని ప్రభావం ఉండనుంది.
గూగుల్(Google) కంపెనీలో ఉద్యోగాలకు(Employees) కోతలు పెడుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్స్‌లో వంద మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ వెల్లడించింది. కాస్ట్ కటింగ్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వాయిస్ బేస్డ్‌తో పాటు ఏ.ఆర్.హార్డ్‌వేర్‌లోని ఉద్యోగులపై దీని ప్రభావం ఉండనుంది. పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తోందని గూగుల్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నఈ విభాగాలకు చెందిన ఉద్యోగులను తొలగిస్తామని స్పష్టం చేసింది. ఉన్న వనరులతోనే మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నాం. కొన్ని టీమ్స్‌లో కొంత మందిని తొలగించక తప్పడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ లేఆఫ్‌ల(Layoff) ప్రభావం ఉంటుందని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
లే ఆఫ్‌లకు సబంధించి తమ ఉద్యోగులకు గూగుల్ సమాచారం ఇచ్చింది. అయితే...గూగుల్ కంపెనీలోనే ఇతర ఉద్యోగాలకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించింది. లే ఆఫ్‌ల నిర్ణయంపై నిర్ణయంపై గూగుల్ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఉద్యోగాలు తొలగించడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని పోరాటం చేస్తామంటున్నారు. మరోవైపు ఈ లేఆఫ్‌లు కొనసాగుతుండగానే ఫిట్‌బిట్ కంపెనీలో కీలక ఉద్యోగులు ఆ కంపెనీని వదులేస్తున్నారు. ఫిట్‌బిట్ కంపెనీని గూగుల్ 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.
అయితే ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది నుంచి లేఆఫ్‌లు కొనసాగుతున్నాయి. ఈ బాటలో గూగుల్, అమెజాన్, కాగ్నిజెంట్‌లాంటి దిగ్గజ సంస్థలే కాకుండా పలు మధ్యతరహా, చిన్నా, చితక కంపెనీలు చాలానే ఉన్నాయి. కాస్ట్ కటింగ్‌లో భాగంగా ఈ లేఆఫ్‌లు తప్పడం లేదని కంపెనీలు వివరిస్తున్నాయి. ఇటీవల ఫ్రంట్ డెస్క్ అనే కంపెనీ రెండు నిమిషాల్లోనే తన కంపెనీకి చెందిన 200 మంది పార్ట్‌టైం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించింది. స్వయంగా సీఈవో టీమ్స్ మీటింగ్‌కు వచ్చి 200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పి వారికి షాక్ ఇచ్చారు. దీంతో ఉద్యోగ భద్రత కోసం పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమనుకుంటూ గడుపుతున్నారు టెకీలు.