Goods Trains : లోకో పైలట్ లేకుండా పరుగులు పెట్టిన గూడ్స్ రైలు
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు(Goods Train) 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. కలకలం సృష్టించిన ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని(Jammu Kashmir) కథువా స్టేషన్‌లో చోటు చేసుకుంది. 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ము కశ్మీర్ నుంచి పంజాబ్(Punjab) బయలుదేరిన గూడ్స్ రైలు జమ్ములోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగింది. అయితే లోకో పైలట్(Loco pilot), అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెళ్లిపోయారు

goods train
లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు(Goods Train) 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించింది. కలకలం సృష్టించిన ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని(Jammu Kashmir) కథువా స్టేషన్‌లో చోటు చేసుకుంది. 53 వ్యాగన్ల చిప్ స్టోన్స్ లోడుతో జమ్ము కశ్మీర్ నుంచి పంజాబ్(Punjab) బయలుదేరిన గూడ్స్ రైలు జమ్ములోని కథువా రైల్వేస్టేషన్‌లో ఆగింది. అయితే లోకో పైలట్(Loco pilot), అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండా వెళ్లిపోయారు. పఠాన్‌కోట్‌వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటంతో రైలు ముందుకు కదిలింది. ఆ తర్వాత గంటకు 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంది. అలా రయ్యిమంటూ దూసుకుపోతూ 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు ఉచ్చి బస్సీ రైల్వేస్టేషన్ దగ్గర చెక్క దిమ్మెలు అడ్డుపెట్టి గూడ్స్ రైలును ఆపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్‌పై ఎదురుగా రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
