ఇన్‌కం ట్యాక్స్ పేయర్స్ (IT Payers), పెన్షనర్స్‌కు (Pensioners) ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం (Central Govt) శుభవార్త చెప్పనుందా అంటే అవనని పలు నివేదికలు చెప్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున మిడిల్ క్లాస్ ఉద్యోగులకు, పెన్షనర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇన్‌కం ట్యాక్స్ పేయర్స్ (IT Payers), పెన్షనర్స్‌కు (Pensioners) ఈ సారి బడ్జెట్‌లో కేంద్రం (Central Govt) శుభవార్త చెప్పనుందా అంటే అవనని పలు నివేదికలు చెప్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున మిడిల్ క్లాస్ ఉద్యోగులకు, పెన్షనర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు స్టాండర్డ్ డిడక్షన్ (Standard Deduction) పరిమితిని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రూ.50 వేలు ఉన్న స్టాండర్డ్ డిడక్షన్‌ను లక్ష వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో (Oton Account Budget)ఈ మేరకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ అంటే మిడిల్ క్లాస్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్లు లేకుండా క్లెయిం చేసుకునే అవకాశం. ఉద్యోగుల సంస్థలే పన్ను లెక్కించే సమయానికి ప్రామాణిక తగ్గింపును ఆటోమెటిక్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నందున దీనికి కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం రాదు.
స్టాండర్డ్ డిడక్షన్‌పై చివరిసారిగా 2019లో కేంద్రం కొంత లిమిట్ పెంచింది. ఈ ప్రామాణిక తగ్గింపు తొలుత 1974లో తీసుకొచ్చారు.. ఆ తర్వాత 2004-05 సందర్బంగా దీనిని తొలించారు. మళ్లీ 2018 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. రూ.40 వేలుగా నిర్ధారించిన 2019 మధ్యంతర బడ్జెట్‌లో దీనిని రూ.50 వేలకు పెంచారు. ఆ తర్వాత దీనిని పెంచకపోవడంతో గత కొంత కాలంగా కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50 వేల నుంచి లక్షకు పెంచాలని కోరుతున్నారు. ఐదేళ్లలో అన్ని ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం (Inflation) పెరగడంతో స్టాండర్డ్ డిడక్షన్‌ను పెంచాలని కోరుతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ లక్ష రూపాయల వరకు పెంచితే 10 లక్షల వార్షిక ఆదాయం వచ్చే ఉద్యోగి పన్ను 96 వేల 200 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆదాయపన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.9 లక్షలే అవుతుంది. స్టాండర్డ్ డిడక్షన్ 75 వరకు పెంచితే.. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 9.25 లక్షలుగా ఉంటుంది. అంటే చెల్లించాల్సిన పన్ను తగ్గిపోతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రామాణిక తగ్గింపుపై ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు.