ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల

ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకం కింద గ్యాస్ తీసుకుంటున్న వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లకు రాయితీ గడువును మరో ఏడాది కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కేంద్ర ప్రభుత్వం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ గ్యాస్‌పై రూ.300 రాయితీని అందిస్తోంది. ఈ గడువును మార్చి 31, 2025 వరకు పొడిగించినట్లు కేంద్రం తెలిపింది. మే 2022లో ప్రభుత్వం PMUY లబ్ధిదారులకు సిలిండర్‌కు 200 రూపాయలను సబ్సిడీని అందించింది కేంద్రం. అక్టోబర్ 2023లో 300కి పెంచారు. ఉజ్వల లబ్ధిదారులకు, సిలిండర్‌కు 300 సబ్సిడీని పరిగణనలోకి తీసుకున్న తర్వాత ధర 603గా ఉంటుంది. ఇది నేరుగా కనెక్షన్ హోల్డర్‌ల బ్యాంక్ ఖాతాలకు వెళుతుంది. PMUY లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ సిలిండర్లు రాయితీ కింద ఇస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లను నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంచి జరగనుంది. ప్రస్తుతం 46 శాతంగా ఉన్న డియర్ నెస్ అలవెన్స్.. ఇకపై 50 శాతం అవ్వనుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2024 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. చివరిగా డీఏ పెంపు అక్టోబర్ 2023లో 4 శాతం పెంపుతో 46 శాతానికి పెరిగింది. ఇప్పుడు మరోసారి కేంద్రం ఇంకో నాలుగు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ 49లక్షల మంది, 68మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖాజానాపై అదనంగా రూ.12,868.72 కోట్లు భారం పడనుంది.

Updated On 7 March 2024 8:55 PM GMT
Yagnik

Yagnik

Next Story