దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం (gold), వెండి (silver) ధరలు ఈ రోజు మాత్రం అలాగే ఉన్నాయి.

దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం (gold), వెండి (silver) ధరలు ఈ రోజు మాత్రం అలాగే ఉన్నాయి. గత వారం రోజుల్లో బంగారం రేటు సుమారు అయిదు వేల రూపాయలు తగ్గింది. ఆదివారం హైదరాబాద్(hyderabad), విజయవాడలో(vijayawada) 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 69,900 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు 63,250 రూపాయలు ఉంది. ఇక వారం రోజుల క్రితం జులై 21న ఈ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 67,800 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 73,970 రూపాయలుగా ఉంది. అంటే 24 క్యారెట్ల బంగారం ధర వారం రోజుల్లో 4,970 రూపాయలు తగ్గగా, 22 క్యారెట్ల ధర 4,550 రూపాయలు తగ్గింది. అలాగే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 7 వేల రూపాయలు తగ్గడం విశేషం. బడ్జెట్‌ 2024లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. అందుకే బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. బంగారం కొనే తాహతు ఉంటే మాత్రం ఇదే సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. పైగా వచ్చేది శ్రావణమాసం. అప్పుడు బంగారం పెరిగే ఛాన్స్‌ ఉంటుంది.

ehatv

ehatv

Next Story