బంగారమంటే(Gold) భారతీయులకు చెప్పలేనంత మోజు. కాసు బంగారమున్నా సరే మొహాలు బంగారంలా వెలిగిపోతాయి. అసలు భారతీయులకు ఏ విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటే వుండవచ్చేమో కానీ బంగారమనేసరికి అందరూ ఒక్కటవుతారు. అదేం మహత్యమో ఏమో! అతి సామాన్యుడి నుంచి కోట్లకు కోట్లు వెనుకేసుకున్న వారి వరకూ పుత్తడంటే క్రేజు. ఇక మహిళామణుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది.

బంగారమంటే(Gold) భారతీయులకు చెప్పలేనంత మోజు. కాసు బంగారమున్నా సరే మొహాలు బంగారంలా వెలిగిపోతాయి. అసలు భారతీయులకు ఏ విషయంలోనైనా భేదాభిప్రాయాలుంటే వుండవచ్చేమో కానీ బంగారమనేసరికి అందరూ ఒక్కటవుతారు. అదేం మహత్యమో ఏమో! అతి సామాన్యుడి నుంచి కోట్లకు కోట్లు వెనుకేసుకున్న వారి వరకూ పుత్తడంటే క్రేజు. ఇక మహిళామణుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది. అవకాశం దొరికిందంటే చాలు గోల్డ్‌ షాపుల అడ్రసులు వెతికే పనిలో పడతారు. బంగారం కొనేందుకు ముచ్చటపడతారు.. సిరిసంపదలున్న చోట బంగారముంటుందో, బంగారమున్న చోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు బంగారమున్న చోట లక్ష్మీ తాండవిస్తుందనేది గట్టిగా నమ్ముతారు. అలా బంగారం మన సంస్కృతిలో ఓ భాగమయ్యింది.

శుభకార్యాలలో, పండగల్లో బంగారం ఉండాల్సిందే. పెట్టుబడులకు బంగారం ఓ వరంగా మారింది. అందుకే బంగారం వినియోగంలో చైనా(China) తర్వాత మనమే సగర్వంగా నిలుస్తున్నాం. బంగారం దిగుమతిలో మనం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. రేపు మనం 76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భాన బంగారం ధరల ప్రస్థానాన్ని పరికిద్దాం..
స్వతంత్రం వచ్చిన తర్వాత మొదలైన బంగారం ధర(Gold Price) పెరుగుతూ వస్తుంది . ఒకట్రెండుసార్లు తగ్గిందంతే! కంచు మోగినట్టు కనకం మోగదు కరెక్టే కానీ ధరల విషయం మాత్రం బంగారం ఎప్పుడూ మోత మోగిస్తూనే ఉంది.

1942లో తులం అంటే పది గ్రాముల బంగారం ధర 44 రూపాయలే ఉండింది. 1947కు వచ్చేసరికి అది రెట్టింపయ్యి 88 రూపాయల 62 పైసలయ్యింది. స్వాత్రంత్యం తర్వాత గోల్డ్‌ రేటులో అతి పెద్ద పతనం 1964లో చోటు చేసుకుంది. అప్పుడు తులం బంగారం రేటు 63 రూపాయల 25 పైసలు మాత్రమే! 1970కి వచ్చేసరికి పది గ్రాముల బంగారం రేటు 184 రూపాయలకు చేరుకుంది. మరో దశాబ్దం నాటికి అంటే 1980లో 1,330 రూపాయలయ్యింది. 1990 నాటికి ధర బాగా పెరిగింది. తులం బంగారం 3,200 రూపాయలు దాటింది. 2001 నాటికి సుమారు 15 శాతం చొప్పున పెరిగింది. 2008-2009లో ఆర్థిక సంక్షోభం మార్కెట్లను కుదిపేసినప్పటి 2000-2010 మధ్య బంగారం రేటు బాగా పెరిగింది. 4,400 రూపాయల నుంచి 18,500 రూపాయల వరకు పెరిగింది. తర్వాత దశాబ్దంలో కూడా బంగారం ధరలు రెండింతలు పెరిగాయి.

2021లో పది గ్రాముల బంగారం ధర 48,720 రూపాయలకు చేరుకుంది. రెండేళ్లకు 60 వేల రూపాయలకు చేరుకుని రికార్డు సృష్టించింది. ఈ ఏడాది గోల్డ్‌ రేట్లలో కొన్ని హెచ్చుతగ్గులు కనిపించాయి. గత సంవత్సరంతో పోలిస్తే బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం, అమెరికా ఫెడ్‌ రేటు పెరుగుదల, ద్రవ్యోల్బణం గోల్డ్‌ రేట్లు పెరగడానికి ప్రధాన కారణాలు. పెట్టుబడికి బంగారం కంటే మించింది లేదు. ప్రపంచ మార్కెట్లలో కదలిక కూడా బంగారం విలువను నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ఆటోమాటిక్‌గా బంగారం ధర తగ్గుతుంది. మనం సగం బంగారాన్ని స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22లో మొత్తం బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ వాటా 45.8శాతం. స్విట్జర్లాండ్ బంగారం కోసం అతిపెద్ద రవాణా కేంద్రం. అక్కడ అత్యుత్తమ శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటిల్లో శుద్ధి చేసిన బంగారం ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతోంది. బంగారంపై పెట్టిన పెట్టుబడికి ఎప్పుడూ డోకా ఉండదు. నష్టపోయే అవకాశమే ఉండదు. పైగా బంగారం ఉంటే కష్టకాలాల్లో ఆదుకుంటుంది. వజ్రం కలకాలం నిలిచి ఉంటుందని అంటారు కానీ కలకాలం నిలిచి ఉండేది బంగారమే! అందుకే వచ్చే సువర్ణావకాశాన్ని ఎవరూ వదులుకోరు.

Updated On 14 Aug 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story