బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండగ (Sankranti festival) వేళ బంగారం ధరలు (Gold prices) మరింత పెరిగాయి. ఒక్కో రోజు విరామం తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు పసిడి ధరలు పైపైకి ఎగబాకాయి. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈరోజు మోస్తరుగా పెరిగాయి.

Gold price hike
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సంక్రాంతి పండగ (Sankranti festival) వేళ బంగారం ధరలు (Gold prices) మరింత పెరిగాయి. ఒక్కో రోజు విరామం తర్వాత బంగారం ధర మళ్లీ పెరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు పసిడి ధరలు పైపైకి ఎగబాకాయి. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈరోజు మోస్తరుగా పెరిగాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు పసిడి ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర తులంపై 170 రూపాయలు.. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 150 రూపాయాలు పెరిగింది (Gold price hike again). ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.63,440, 22 క్యారెట్ల పసిడి తులం ధర రూ. 58,150లుగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్న వెండి ధరలు కూడా ఈ రోజు కాస్త పెరిగాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర కేజీకి 300 రూపాయలు పెరిగి..78,300 లకు చేరుకుంది.
