బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పండగకు ముందు తగ్గుముఖం పట్టిన పసిడి దరల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గోల్డ్ రేట్లు..భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో బయ్యర్స్ కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయమన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట.

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పండగకు ముందు తగ్గుముఖం పట్టిన పసిడి దరల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గోల్డ్ రేట్లు..భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో బయ్యర్స్ కొనుగోళ్లవైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయమన్నది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట. కొంత కాలంగా అప్ అండ్ డౌన్ అవుతున్న బంగారం ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు తులం బంగారానికి రూ. 300 పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ మార్కెట్‎తోపాటు దేశ వ్యాప్తంగా వివిధ నగరల్లో దాదాపుగా బంగారం ధరల్లో ఇదే స్థాయిలో పెరుగుదల కనిపించింది. గురువారం హైదరాబాద్ మార్కె్ట్‎లో 22 క్యారెట్ బంగారం ధర రూ. 57 వేల 400 ఉండగా, నేడు రూ. 300 పెరిగి.. రూ. 57 వేల 700లకు చేరుకుంది. 24 క్యారెట్ బంగారం రేటు తులానికి 62 వేల 950గా ఉంది. ఇక..హైదరాబాద్‌ మార్కెట్‎లో కిలో వెండి ధర. రూ. 77 వేల 200లుగా ఉంది. ఒకానొక సమయంలో 81 వేల మార్క్‎ను తాకిన చేసిన వెండి ధరలు.. ఈ మధ్యకాలంలో దాదాపు రూ. 3 వేలకుపైగా తగ్గడం విశేషం. నిన్నటితో పోల్చితే ఈ రోజు ధరలో 200 రూపాయల పెరుగుదల కనిపించింది. మరోవైపు ఈ ఏడాది బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందన్నది మార్కెట్ నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరుగుతుండటమే దీనికి కారణం. గత ఏడాది బంగారం, వెండి ధరలు పైపైకి వెళుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ ఏడాది కూడా బంగారం, వెండి ధరలు అదే బాటలో పయనిస్తాయని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. దీంతో పసిడి ప్రియులు ప్రతి డిప్‎లో బంగారం, వెండి కొనుగోలుకు ముందుకొస్తున్నారు.

Updated On 19 Jan 2024 12:57 AM GMT
Ehatv

Ehatv

Next Story