నూతన సంవత్సరం(New Year) సందర్భంగా బంగారం(Gold) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. క్రితం రోజు రూ.350 మేర తగ్గిన బంగారం ధర ఇవాళ కూడా స్థిరంగా ఉంది. గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే, వెండి(silver) ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. డిసెంబర్ 31, 2023, ఆదివారం రోజున హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
నూతన సంవత్సరం(New Year) సందర్భంగా బంగారం(Gold) కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకు శుభవార్తే. క్రితం రోజు రూ.350 మేర తగ్గిన బంగారం ధర ఇవాళ కూడా స్థిరంగా ఉంది. గోల్డ్ కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే, వెండి(silver) ధరలో మాత్రం స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. డిసెంబర్ 31, 2023, ఆదివారం రోజున హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 58,550 ఉండగా..ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 63,870 ఉంది. ఇక ఢిల్లీ(Delhi) మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులానికి రూ. 58,700లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 63,970లుగా ఉంది. మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. ఇక పండగలు, శుభకార్యాలల్లో బంగారంతో అలంకరించుకోవడం మహిళలకు తప్పనిసరి. ఇటీవలి కాలంలో పురుషుల్లో కూడా బంగారం వినియోగం పెరిగిపోయింది. దీంతో మన దేశంలో బంగారానికి మరింత డిమాండ పెరిగింది. ప్రపంచంలో
బంగారం వినియోగంలోనూ మన దేశమే టాప్‌లో నిలుస్తోంది.