మహిళలకో శుభవార్త.. బంగారం ధరలు(Gold Price) తగ్గుతున్నాయ. రోజు రోజుకు పసిడి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

Gold Price Decrease
మహిళలకో శుభవార్త.. బంగారం ధరలు(Gold Price) తగ్గుతున్నాయ. రోజు రోజుకు పసిడి ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీనమైన ట్రెండ్ కారణంగా దేశీ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. జూన్ నెలలోనే బంగారం ధరలో ఏకంగా 3.3 శాతం వరకు తగ్గాయి. ధరల తగ్గుదల ఆగి పోయిందని భావిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఏ మాత్రం తగ్గినా ఈ అవకాశాన్ని మిస్ కాకుండా కొనుగోళ్లకు ఉపయోగించు కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా(America Job Data),అమెరికా డాలర్‌పై కూడా ఒత్తిడి తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర 400 రూపాయలు పెరిగి 54, 550 రూపాయల దగ్గర ఉంది. అటు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములు 59510 రూపాయల వద్ద ఉంది. అలాగే వెండి ధర కిలో వెయ్యి రూపాయలు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి 76, 700 రూపాయలు ఉంది.
