మహిళలకు శుభవార్త..ఎట్టకేలకు బంగారం ధర దిగొచ్చింది. ఐదు రోజుల తర్వాత బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కొత్త ఎడాదిలో తొలిసారి పసిడి ధర పడిపోయింది. గత ఏడాది డిసెంబర్ లో గోల్డ్ రేట్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.

మహిళలకు శుభవార్త..ఎట్టకేలకు బంగారం ధర(Gold rate) దిగొచ్చింది. ఐదు రోజుల తర్వాత బంగారం కొనాలనుకునే వారికి ఊరట లభించింది. వరుసగా పెరుగుతూ రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పట్టాయి. కొత్త ఎడాదిలో తొలిసారి పసిడి ధర పడిపోయింది. గత ఏడాది డిసెంబర్ లో గోల్డ్ రేట్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఒక స్థాయిలో సామాన్యులు కొనుగోలు చేసే వీలులేకుండా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 2023, డిసెంబర్ 28న 22 క్యారెట్స్ బంగారం ధర హైదరాబాద్‌(gold rates in hyderabad)లో రూ. 58,900లు ఉండగా, 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 64,250 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో స్థిరంగా ఉన్న బంగారం ధర..తిరిగి జనవరి 2న భారీగా పెరిగింది. దీంతో గోల్డ్ రేట్స్ ఎంతగా పెరుగుతాయోనన్న ఆందోళన కొనుగోలు దారుల్లో కనిపించింది. కానీ బుధవారం మాత్రం తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 చొప్పున తగ్గి రూ. 58,500 లకు దిగివచ్చింది. మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 270 చొప్పున తరిగి రూ.63,820 లకు క్షీణించింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 47,860 రూపాయలు ఉంది. ఢిల్లీలో కూడా ఇదే బాటలో బంగారం రేటు పడిపోయింది. 22 క్యారెట్స్‌పై 10 గ్రాములపై రూ. 250 తగ్గి ప్రస్తుతం రూ. 58,650 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 63,970 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక వెండి ధరలు కూడా మోస్తరుగా తగ్గాయి. హైదరాబాద్‌లో వెండి ధర ఈరోజు కేజీకి రూ.300 తగ్గింది. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 80,000 లుగా ఉంది. ఇది క్రితం రోజున రూ.80,300 ఉండేది.

Updated On 3 Jan 2024 11:10 PM GMT
Ehatv

Ehatv

Next Story