దిగివచ్చిన బంగారం, వెండి ధరలు

వారం పది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం(Gold), వెండి ధరలు(silver price) సోమవారం భారీగా తగ్గాయి.

ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర 1300 రూపాయలు తగ్గి 81,000 రూపాయలకు పడిపోయింది. స్టాకిస్టులు, రిటైల్ వ్యాపారుల నుంచి భారీ అమ్మకాలు జరగడంతో బంగారం ధరలు తగ్గాయని అంటోంది ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ . గురువారం ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర 82,400 రూపాయలు పలికితే, శుక్రవారం బెంగళూరులో 83,050 రూపాయలతో జీవిత కాల గరిష్ట రికార్డు నెలకొల్పింది. అలాగే కిలో వెండి ధర 4,600 రూపాయలు తగ్గి 94,900 రూపాయల దగ్గర నిలిచింది.

Eha Tv

Eha Tv

Next Story