దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు(Navrathri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అంతటా అమ్మవారే కనిపిస్తున్నారు. వివిధ రూపాలలో, భిన్న అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. చాలా చోట్ల అమ్మవారి మండపాలు వెలిశాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అందరికీ తాము ప్రతిష్టించిన విగ్రహాలే ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు.దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు(Navrathri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అంతటా అమ్మవారే కనిపిస్తున్నారు. వివిధ రూపాలలో, భిన్న అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. చాలా చోట్ల అమ్మవారి మండపాలు వెలిశాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అందరికీ తాము ప్రతిష్టించిన విగ్రహాలే ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు.
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు(Navrathri Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అంతటా అమ్మవారే కనిపిస్తున్నారు. వివిధ రూపాలలో, భిన్న అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్నారు. చాలా చోట్ల అమ్మవారి మండపాలు వెలిశాయి. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అందరికీ తాము ప్రతిష్టించిన విగ్రహాలే ఆకర్షణీయంగా ఉండాలని అనుకుంటారు.
అందుకోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో(Rajasthan) కూడా ఓ అసాధారణమైన దుర్గామాత విగ్రహాన్ని(Idol) ఏర్పాటు చేశారు. చురు జిల్లాలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహాన్ని కనులారా వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. తొమ్మిదిన్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహంపై లక్షా పాతిక వేల అమెరికన్ డైమండ్స్(american Dollars) పొదిగారు.
ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన విగ్రహాలలో ఇదే అత్యంత ఖరీదైనదని అంటున్నారు. బెంగాల్ కు చెందిన పది మంది కళాకారులు ఏకథాటిగా మూడు నెలల పాటు శ్రమించారు. దుర్గాదేవి అష్టభుజ విగ్రహాన్ని అద్భుతంగా తయారుచేశారు. రూపం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టిని వాడారు. పూర్తి రూపం సంతరించుకున్న తర్వాత, దానిపై ఖరీదైన అమెరికన్ వజ్రాల్ని పొదిగారు.
ఈ విగ్రహాన్ని పండిట్ బల్-ముకుంద్ వ్యాస్ ఏర్పాటుచేశారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా అమెరికాలో పర్యటించాడు. చికాగో వెళ్లి, తొమ్మిది రంగుల్లో మెరిసే రకరకాల వజ్రాల్ని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఆ వజ్రాలతో బెంగాల్ కు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహంపై వజ్రాలు పొదగడమే కాకుండా బంగారు నగిషీ కూడా అద్దారు. ప్రస్తుతం ఈ దుర్గాదేవి మంటపం పెద్ద పర్యాటక ప్రాంతంగా మారింది.