గోవా బీచ్‌ల(Goa beach), హెరిటేజ్ లోకేషన్లలో(Heritage) వర్క్ స్పేస్‌లను(Work space) ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను స్టార్టప్ కంపెనీలను(Startup companies) ప్రోత్సహించనున్నది.
గోవా బీచ్‌ల(Goa beach), హెరిటేజ్ లోకేషన్లలో(Heritage) వర్క్ స్పేస్‌లను(Work space) ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను స్టార్టప్ కంపెనీలను(Startup companies) ప్రోత్సహించనున్నది. గోవాలని బీచ్‌లు, హెరిటేజ్ కట్టడాల ప్రాంతంలో స్టార్టప్‌లను స్థాపించేదిశగా ఆలోచనలు చేస్తోంది. రానున్న కొద్ది సంవత్సరాల్లోనే ఆసియాలోనే బెస్ట్ స్టార్టప్ డెస్టినేషన్‌గా మార్చాలని ప్రయత్నం చేస్తోంది. గోవా గ్రామాలను డిజిటలైజేషన్(Digitization) చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ -19(Covid-19) మహమ్మారి తర్వాత దాదాపు 214 స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు హాట్‌స్పాట్‌గా మారుతోందని గోవా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Technology), ఎలక్ట్రానిక్స్(Electronic), కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. బీచ్‌లలో సహజంగా ఉండే ఆహ్లాదకర వాతావరణం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండడమే కాకుండా కొత్త ఆలోచనలు ఆవిష్కృతం అవుతాయని అంచనాలు వేస్తున్నారు. గోవా బీచ్‌లలో డిజిటల్ వర్క్‌స్టేషన్‌లతో కూడిన సీ హబ్‌లను ప్రారంభించనున్నట్లు పర్యాటక, ఐటీ మరియు ప్రింటింగ్ & స్టేషనరీ మంత్రి రోహన్ ఖౌంటే తెలిపారు. విదేశీ నిపుణులు గోవా నుంచి వచ్చి పని చేసేందుకు వీలుగా డిజిటల్ నోమాడ్ వీసాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని ఖౌంటే చెప్పారు. రాష్ట్రంలోని స్టార్టప్‌లను దాదాపు 35% మహిళలు నడుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరింత మంది మహిళలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారిస్తోందని ఖౌంటే తెలిపారు. ఉత్తమ పని-జీవిత సమతుల్యతను సాధించేందుకు గోవాకు రావడానికి ఎక్కువ మంది నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఇందుకు స్థానిక యువతను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్టార్టప్‌ల ఆవిష్కరణలు, వాటి అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని ప్రభుత్వం వివరించింది.