Global fertility in 204 countries : ఇండియాలో మగతనం బాగా తగ్గుతోందట!
మగాళ్లం.. మాకేంటని విర్రవీగకండ్రా బాబు! రాబోయే రోజులు మీవి కావు. దేన్ని చూసి ఇంతగా హుంకరిస్తున్నారో ఆ మగతనమే బాగా తగ్గిపోతున్నదట! నిజమండి.. గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అనే సంస్థకు చెందిన పరిశోధకులు ఒట్టేసి మరీ చెబుతున్నారు. తమ పరిశోధన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో పబ్లిష్ కూడా చేశారు. అది చదివిన తర్వాత నిజమే సుమీ అని అనుకోకుండా ఉండరు. మన దేశంలో 1950లో సంతానోత్పత్తి రేటు 6.2గా ఉంటే అది 2021 నాటికి 2.0కు పడిపోయిందని అధ్యయనం చెబుతోంది.
మగాళ్లం.. మాకేంటని విర్రవీగకండ్రా బాబు! రాబోయే రోజులు మీవి కావు. దేన్ని చూసి ఇంతగా హుంకరిస్తున్నారో ఆ మగతనమే బాగా తగ్గిపోతున్నదట! నిజమండి.. గ్లోబర్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (GBD) అనే సంస్థకు చెందిన పరిశోధకులు ఒట్టేసి మరీ చెబుతున్నారు. తమ పరిశోధన వివరాలను లాన్సెట్ జర్నల్‌లో పబ్లిష్ కూడా చేశారు. అది చదివిన తర్వాత నిజమే సుమీ అని అనుకోకుండా ఉండరు. మన దేశంలో 1950లో సంతానోత్పత్తి రేటు 6.2గా ఉంటే అది 2021 నాటికి 2.0కు పడిపోయిందని అధ్యయనం చెబుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత తగ్గబోతున్నదట! 2050 సంవత్సరం వచ్చేసరికి సంతానోత్పత్తి(Birth Rate) రేటు 1.29కు పడిపోతుందని, 2100 సంవత్సరానికి 1.04కి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయిదో దశకంలో ఇండియాలో ఓ మహిళ సగటున 4.8 పిల్లలకు జన్మనిస్తే 2021 వచ్చేసరికి 2.2 పిల్లలకు మాత్రమే జన్మనిచ్చింది. ఇది మరింత తగ్గిపోనున్నదని, 2050 సంవత్సరం వచ్చేసరికి ఓ మహిళ సగటున 1.8 మందికి, 2100 సంవత్సరం నాటికి 1.6 మందికి జన్మనివ్వవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ భూమ్మీద 1950లో 9.3 కోట్ల మంది జన్మించారు. 2016లో అత్యధికంగా 14.2 కోట్ల మంది పుట్టారు. అదే 2021 వచ్చేసరికి జననాల సంఖ్య 12.9 కోట్లకు తగ్గింది. ఇండియా విషయానికి వస్తే 1950లో 1.6 కోట్ల మంది జన్మించారు. అదే 2021లో 2.2 కోట్ల మంది పుట్టారు. ఈ లెక్కన 2050లో 1.3 కోట్ల మంది జన్మించివచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. 21వ శతాబ్దంలో అనేక దేశాలు తక్కువ సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అదేమిటో కానీ అల్పాదాయ దేశాలు మాత్రం అధిక సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నాయట! 2021లో మొత్తం ప్రపంచ జననాల్లో పేద దేశాలలోనే 18 శాతం ఉన్నదట! 2100 సంవత్సరం నాటికి ఇది 35 శాతం కావచ్చని జీబీడీ భావిస్తోంది.