మే 3న కుల హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనలు బాధాకరమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం అన్నారు. శాంతిభద్రతలే రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి సుభిక్షాన్ని కలిగిస్తాయని, శాంతియుతంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మే 3న కుల హింస చెలరేగినప్పటి నుంచి మణిపూర్‌(Manipur)లో చోటుచేసుకున్న అమానవీయ ఘటనలు(Violence) బాధాకరమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Loksabha Speaker Om Birla) శనివారం అన్నారు. శాంతిభద్రతలే రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి సుభిక్షాన్ని కలిగిస్తాయని, శాంతియుతంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేఘాలయ శాసనసభ(Meghalaya Assembly)లో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (Commonwealth Parliamentary Association) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్‌(India Region Conference)ను ప్రారంభిస్తూ.. ఎలాంటి అమానవీయ ఘటనలు జరిగినా బాధాకరమేన‌న్నారు. ఇటువంటి ఘ‌ట‌న‌ల‌ వల్ల మేమంతా బాధపడ్డాం. మనమందరం శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నించాలి. ఎవరినీ నొప్పించకూడదనేది మన నైతిక బాధ్యత. మానవత్వం దృక్పథం నుండి శాంతి కోసం మేము పిలుపునిస్తాము.

ఈ కాన్ఫరెన్స్ లో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా(Conrad K Sangma), రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్(Rajya Sabha Deputy Chairman Harivamsh), అస్సాం అసెంబ్లీ స్పీకర్ బిస్వజిత్ డైమరీ(Assam Assembly Speaker Biswajit Daimary), మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ థామస్ ఎ. సంగ్మా(Assembly Speaker Thomas A. Sangma), అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ పసాంగ్ డి. సోనా, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు, మేఘాలయ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈశాన్య రాష్ట్రాలు జీవవైవిధ్యంతో సమృద్ధిగా ఉన్నాయని.. ఇక్కడ సంభవించే ఏదైనా పర్యావరణ అసమతుల్యత మొత్తం భారతదేశ పర్యావరణ పరిస్థితిపై చాలా విస్తృత ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. అందువల్ల ఇలాంటి సున్నిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణకు మెరుగైన సన్నాహాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కాన్ఫరెన్స్‌లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రసంగిస్తూ.. ప్రాంతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై చర్చలు కొనసాగించేందుకు చొరవ తీసుకున్నందుకు ఈశాన్య ప్రాంత ప్రిసైడింగ్ అధికారులను అభినందించారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు, ఈశాన్య ప్రాంత ప్రత్యేక సూచనలతో నిర్వహణ వ్యూహాలపై చర్చించనున్నారు.

Updated On 29 July 2023 8:50 PM GMT
Yagnik

Yagnik

Next Story