గతంలో ఆడపిల్లలకు 14-15 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేస్తే 17 ఏళ్లకే తల్లులు అయ్యేవారని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ.. 17 ఏళ్ల బాలిక చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాతే బాలిక గర్భం దాల్చిందని ఆమె తండ్రికి తెలిసింది. బాలిక వయస్సు దృష్ట్యా పిండాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Girls used to give birth by 17, read Manusmriti Gujarat High Court on minor’s abortion plea
గతంలో ఆడపిల్లల(Girls)కు 14-15 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు చేస్తే 17 ఏళ్లకే తల్లులు అయ్యేవారని గుజరాత్ హైకోర్టు(Gujarat Highcourt) పేర్కొంది. తన 7 నెలల గర్భాన్ని తొలగించాలని కోరుతూ.. 17 ఏళ్ల బాలిక చేసిన పిటిషన్(Pitition)పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్య చేసింది. మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. ఏడు నెలలు గడిచిన తర్వాతే బాలిక గర్భం దాల్చిందని ఆమె తండ్రికి తెలిసింది. బాలిక వయస్సు దృష్ట్యా పిండాన్ని వైద్యపరంగా రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ (Abortion Plea) దాఖలు చేశాడు.
గర్భం రద్దు కోసం న్యాయవాది ఒత్తిడి చేయగా.. జస్టిస్ సమీర్ జే దవే(Justice Samir J Dave) స్పందిస్తూ.. “పాత కాలంలో అమ్మాయిలకు 14-15 సంవత్సరాలలోపు వివాహం.. 17 ఏళ్లలోపు సంతానం కలగడం సాధారణం. మీరు చదవరు.. కానీ ఒక్కసారి మనుస్మ్రుతి(Manusmriti) చదవండని సూచించారు.
డెలివరీ తేదీ ఆగస్టు 18 నేపథ్యంలో ముందస్తు విచారణ కోసం.. కోర్టు ముందు మైనర్ బాలిక తండ్రి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సికందర్ సయ్యద్(Senior advocate Sikandar Syed) అప్పీల్ చేశారు. అయితే.. పిండం(Foetus), బాలిక ఇద్దరూ మంచి స్థితిలో ఉన్నట్లయితే గర్భం రద్దు చేయడాన్ని(Termination of Pregnancy) అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది.
బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు(Court) ఆదేశించింది. మైనర్ బాలికకు అత్యవసర ప్రాతిపదికన సివిల్ హాస్పిటల్ వైద్యుల ప్యానెల్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించాలని రాజ్‌కోట్‌లోని సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్(Medical Superintendent of Civil Hospital, Rajkot)ను కోర్టు ఆదేశించింది. వైద్యుల కమిటీ నివేదిక అందించిన తర్వాతే ఈ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు జూన్ 15కి వాయిదా వేసింది.
