దేశంలో మినీ నయాగరా గా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకోట్ జలపాతంలో ఓ యువతి దూకింది. జ‌ల‌పాతం ద‌గ్గ‌ర‌ ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆమె నీటిలో దూకింది.

దేశంలో మినీ నయాగరా(Mini Niagara Waterfalls) గా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)లోని చిత్రకోట్ జలపాతం(Chitrakote waterfal)లో ఓ యువతి దూకింది. జ‌ల‌పాతం ద‌గ్గ‌ర‌ ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆమె నీటిలో దూకింది. ఆ యువ‌తి దాదాపు 110 అడుగుల ఎత్తు నుంచి జలపాతంలో దూకింది. అదృష్టవశాత్తూ ఆమె చావు నుంచి బ‌య‌ట‌ప‌డింది.

లొహందీగూడ(Lohandiguda)లో నివాసముంటున్న యువ‌తి మొబైల్‌లో గేమ్‌(mobile Game)లు ఆడుతోందని కుటుంబ‌స‌భ్యులు మందలించారు. దీంతో ఆగ్రహించిన యువ‌తి జలపాతంలోకి దూకింది. యువతి దూకడం చాలా మంది చూసారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్క‌డివారు భయపడ్డారు. జవాన్లు కూడా యువ‌తిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె జ‌ల‌పాతంలోకి దూకేసింది. అయితే.. యువ‌తి నీటిలోంచి తేలడాన్ని చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను వీడియో(Video) కూడా తీశారు. ప్రజలు, పోలీసులు(Police) యువ‌తిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. ఆమె దూకిందని అక్క‌డున్న‌వారు తెలిపారు.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. కుమారి సరస్వతి మౌర్య(Kumari Saraswathi Maurya) వయసు 18 ఏళ్లు. ఆమె తండ్రి పేరు శాంటో మౌర్య(Santo Maurya). మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో మొబైల్‌లో ఎక్కువ గేమ్స్‌ ఆడుతుంద‌ని బాలిక తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో ఆగ్రహించిన యువ‌తి చిత్రకూట్ జలపాతం వద్దకు వెళ్లి అందులో దూకింది. ఆ తర్వాత ఆమె స్వయంగా ఈత కొట్టుకుంటూ తిరిగి వచ్చింది. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

Updated On 18 July 2023 10:43 PM GMT
Yagnik

Yagnik

Next Story