ఇటీవల బీహార్‌లో వంతెన కూలిన ఘటన మరువకముందే.. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది.
ఇటీవల బీహార్‌లో వంతెన కూలిన ఘటన మరువకముందే.. ఇప్పుడు జార్ఖండ్‌లోనూ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. రాషప్ట్రంలోని గిరిదిహ్ జిల్లాలోని డియోరీ బ్లాక్‌లో అర్గా నదిపై నిర్మిస్తున్న వంతెన స్తంభం భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది, దీని కారణంగా గిర్డర్ విరిగిపోయి వంతెన ధ్వంసమైంది. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని స్థానిక అధికారి తెలిపారు.
#WATCH झारखंड के गिरिडीह में निर्माणाधीन पुल का हिस्सा ढह गया। pic.twitter.com/ueiXHbjrKK
— ANI_HindiNews (@AHindinews) June 30, 2024
జార్ఖండ్ రాజధాని రాంచీకి 235 కిలోమీటర్ల దూరంలోని డియోరీ బ్లాక్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దుమ్రితోలా, కరిపహరి గ్రామాలను కలుపుతూ ఫతేపూర్-భేలావతి రహదారిపై 5.5 కోట్ల రూపాయలతో వంతెనను నిర్మిస్తున్నారు.
గిరిదిహ్ రోడ్డు నిర్మాణ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. 'బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్రిడ్జి ప్రహరీ విరిగిపోవడంతో స్తంభం వంగిపోయింది. ఆ భాగాన్ని పునర్నిర్మించాలని కాంట్రాక్టర్‌ను కోరామని తెలిపారు. మరో ఇంజినీర్ మాట్లాడుతూ.. గర్డర్ షట్టరింగ్ పనులు వారం రోజుల క్రితమే జరిగాయని, పటిష్టం చేసేందుకు కనీసం 28 రోజులు కావాల్సి ఉందన్నారు.