ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. గుజరాత్ 13 మ్యాచ్‌ల తర్వాత 18 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టికలో ఈ జట్టు అగ్రస్థానంలో ఉంది.
ఐపీఎల్ 2023లో సోమవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)ను ఓడించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్(Playoffs)కు చేరిన తొలి జట్టుగా గుజరాత్(Gujarat) నిలిచింది. గుజరాత్ 13 మ్యాచ్‌ల తర్వాత 18 పాయింట్లతో ఉంది. పాయింట్ల పట్టిక(Points Table)లో ఈ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఈ ఓటమితో హైదరాబాద్(Hyderabad)కు ప్లేఆఫ్ తలుపులు మూసుకుపోయాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ తొమ్మిది వికెట్లకు 188 పరుగులు చేసింది. బదులుగా హైదరాబాద్ జట్టు 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది.
గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లలో శుభ్‌మన్ గిల్(Shubman Gill)(101) సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్(Sai Sudarshan) 47 పరుగులతో శుభ్‌మన్ గిల్ కు సహకరించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(Buvaneshwar Kumar) ఐదు వికెట్లు తీశాడు. మార్కో జాన్సెన్(Marco Jansan), ఫజల్హాక్ ఫరూఖీ, టి నటరాజన్(Natarajan) తలో వికెట్ తీశారు. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌లలో క్లాసెన్ 64, భువనేశ్వర్ కుమార్ 27 పరుగులు చేశారు. గుజరాత్ తరఫున షమీ(Mohammad Shami), మోహిత్ శర్మ(Mohit Sharma) చెరో నాలుగు వికెట్లు తీశారు.