సీమా హైదర్(Seema Haider) గుర్తుందా? పాకిస్తాన్(Pakistan) నుంచి అక్రమంగా భారత్‌లో(Indian) అడుగుపెట్టి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె కొన్నాళ్ల పాటు సెలెబ్రెట్‌గా మారారు. అప్పట్లో ఆమెపై పలు అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలు అందరికీ తెలిసిందే! తాజాగా పాకిస్తాన్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్(Gulam Haider) తన మాజీ భార్య సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్(Sachin) మీనాలకు పరువునష్టం నోటీసు ఇచ్చాడు.
సీమా హైదర్(Seema Haider) గుర్తుందా? పాకిస్తాన్(Pakistan) నుంచి అక్రమంగా భారత్‌లో(Indian) అడుగుపెట్టి తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఆమె కొన్నాళ్ల పాటు సెలెబ్రెట్‌గా మారారు. అప్పట్లో ఆమెపై పలు అనుమానాలు వచ్చాయి. ఈ విషయాలు అందరికీ తెలిసిందే! తాజాగా పాకిస్తాన్‌లో ఉంటున్న సీమా హైదర్ భర్త గులాం హైదర్(Ghulam Haider) తన మాజీ భార్య సీమా హైదర్, ఆమె ప్రియుడు సచిన్(Sachin) మీనాలకు పరువునష్టం నోటీసు(defamation notices) ఇచ్చాడు. గులాం హైదర్ తరపు న్యాయవాది మోమిన్ మాలిక్ మూడు కోట్ల రూపాయల పరువునష్టం నోటీసు పంపించారు. అలాగే సీమా తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్‌కు అయిదు కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపారు. ఈ ముగ్గురూ నెల రోజుల్లోగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే జరిమానా కట్టకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గులాం హైదర్ ఇటీవల హర్యానాలోని పానిపట్‌కు చెందిన సీనియర్ న్యాయవాది మోమిన్ మాలిక్‌ను తన తరపు న్యాయవాదిగా నియమించుకున్నారు. సీమా హైదర్‌ను పోలీసులు అరెస్టు చేసి ఆమె నుంచి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో సీమా హైదర్ భర్త పేరు గులాం హైదర్ అని ఉంది. కోర్టు నుంచి ఆమె బెయిల్ పొందినప్పుడు కూడా సంబంధిత పేపర్లలో గులాం హైదర్ భార్య సీమా హైదర్ అని రాసి ఉంది. అంటే ఆమె ఇంకా గులాం హైదర్ భార్యగానే ఉన్నారన్నమాట! ఈ కారణంగానే సీమా హైదర్ పాక్ భర్త గులాం హైదర్ ఆమెకు పరువు నష్టం నోటీసు పంపారు. గులాం హైదర్ పంపిన నోటీసులో తాను సీమా హైదర్ నుండి ఇప్పటి వరకు చట్టబద్ధంగా విడాకులు తీసుకోలేదని తెలిపారు. అలాగే సచిన్ కారణంగానే తన నలుగురు పిల్లలు తనకు దూరమయ్యారని, వారి చదువులు దిగజారుతున్నాయని గులాం హైదర్ ఆవేదన చెందారు.