పబ్జీ గేమ్(PubG) ఆడుతూ భారత్ కుర్రాడి ప్రేమలో కూరుకుపోయిన సీమా హైదర్(Seema Hydher) తన నలుగురు పిల్లలతో ఇండియాలోకి అక్రమంగా వచ్చిన వైనం తెలిసిందే. సచిన్ మీనాను(Sachin Meena) పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) నోయిడాలో(Noida) ఉంటున్న ఆమెకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
పబ్జీ గేమ్(PubG) ఆడుతూ భారత్ కుర్రాడి ప్రేమలో కూరుకుపోయిన సీమా హైదర్(Seema Haider) తన నలుగురు పిల్లలతో ఇండియాలోకి అక్రమంగా వచ్చిన వైనం తెలిసిందే. సచిన్ మీనాను(Sachin Meena) పెళ్లి చేసుకుని ఇక్కడే కాపురం పెట్టిన విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) నోయిడాలో(Noida) ఉంటున్న ఆమెకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆమె పాకిస్తాన్(Pakistan) భర్త గులాం హైదర్(Gulam Haider) ఇండియాకు వచ్చాడు. యూ ట్యూబ్ ఛానెల్‌లో ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పాడు. 'పిల్లలు మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి' అంటూ వీడియోలో పేర్కొన్నాడు. గ్రేటర్ నోయిడా కోర్టు జూన్ 10వ తేదీన గులాం హైదర్‌ను హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. నోయిడా కోర్టుకు హాజరు కావడం కోసం గులాం హైదర్ భారత్‌కు వచ్చాడు. తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సమీ హైదర్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో ఉంటున్న ఆయన సచిన్ మీనాతో సీమా హైదర్ పెళ్లి చెల్లుబాటు కాదని అంటున్నారు. భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేయించారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని చెప్పింది. గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగానే ఉందని అంటున్నారు మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉందని చెప్పారు. సీమా ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని స్పష్టం చేశారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్‌కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. ఈ విషయంలో కోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.