పుట్టిన రోజుంటే బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేయడం, వారితో సంబరాలు జరుపుకోవడమే కదా! కానీ ఓ యువకుడు మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) చోటు చేసుకుంది.
పుట్టిన రోజుంటే బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేయడం, వారితో సంబరాలు జరుపుకోవడమే కదా! కానీ ఓ యువకుడు మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో(Uttarpradesh) చోటు చేసుకుంది. ఆదివారం ఘజియాబద్‌లోని(Ghaziabad) రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలో పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వ్యక్తి నానా న్యూసెన్స్ క్రియెట్ చేశారు. అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో కారు పైకప్పుపై నిలబడి విచ్చల విడిగా పటాకులు పేల్చారు. కరెన్సీ నోట్లను(Currency Note) గాల్లోకి విసిరి గలాటా సృష్టించారు. ప్రశ్నించిన స్థానికులతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. అసభ్యకరంగా దూషించారు. దీంతో అపార్ట్‌మెంట్ ఓనర్స్ సంఘం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఉప్పందించారు. వెంటనే నందిగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలిస్ రవికుమార్ సింగ్ ఘటనస్థతికి వచ్చి ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. యువకులు సృష్టించిన బీభత్సపు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.