ఇందిరాపురంలోని కనవాని బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమై ఉండగా
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఓ యువకుడు పోలీసు వాహనాన్ని ఉపయోగించి ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియో తీసి ఊహించని చిక్కుల్లో పడ్డాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇందిరాపురం ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్న సమయంలో మొయిన్ ఖాన్ అనే వ్యక్తి పోలీసు వాహనాన్ని ఉపయోగించి వీడియో తీశాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే అవుతుండగా, వాహనం డ్రైవర్ సీటు నుంచి యువకుడు దిగుతున్న దృశ్యం వీడియోలో ఉంది. ఫిబ్రవరి 15న పోస్ట్ చేసిన వీడియో కాస్తా వైరల్ అయింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాపురంలోని కనవాని బ్రిడ్జి దగ్గర ట్రాఫిక్ ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమై ఉండగా పోలీసు వాహనం ఖాళీగా ఉండడం.. అక్కడ అధికారులెవరూ లేరని గమనించిన యువకుడు రీల్స్/షార్ట్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియో విస్తృతంగా ప్రజల దృష్టిని ఆకర్షించడంతో, అధికారులు చర్యలు చేపట్టి.. ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.