సార్వత్రిక ఎన్నికల(General elections) చివరి ఘట్టం ఇవాళ్టితో ముగియనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్‌పోల్స్‌(Exis polls) విడుదల కానున్నాయి. ఈవీఎంలలో(EVM) ఓటరు తీర్పు నిక్షిప్తమై ఉంది. ప్రజలు ఎటువైపు మొగ్గుచూపారో తెలియక అభ్యర్థులు తెగ టెన్షన్ పడుతున్నారు. వారికే కాదు, ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్‌కు, ఉత్కంఠతకు సాయంత్రం కాసింత ఉపశమనం దొరికే అవకాశం ఉంది. ఎగ్జిట్‌పోల్స్‌ నిజమే చెబుతాయన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు కానీ అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను బేరీజు వేసుకుంటే క్లారిటీ దొరికే ఛాన్సుంది.

సార్వత్రిక ఎన్నికల(General elections) చివరి ఘట్టం ఇవాళ్టితో ముగియనుంది. సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్‌పోల్స్‌(Exis polls) విడుదల కానున్నాయి. ఈవీఎంలలో(EVM) ఓటరు తీర్పు నిక్షిప్తమై ఉంది. ప్రజలు ఎటువైపు మొగ్గుచూపారో తెలియక అభ్యర్థులు తెగ టెన్షన్ పడుతున్నారు. వారికే కాదు, ప్రజల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ టెన్షన్‌కు, ఉత్కంఠతకు సాయంత్రం కాసింత ఉపశమనం దొరికే అవకాశం ఉంది. ఎగ్జిట్‌పోల్స్‌ నిజమే చెబుతాయన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు కానీ అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ను బేరీజు వేసుకుంటే క్లారిటీ దొరికే ఛాన్సుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. చివరి విడత పోలింగ్‌ ముగిసే దాకా ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకటించవద్దని కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధన విధించడంతో సర్వే సంస్థలన్నీ ఈ రోజు వరకు ఆగాయి. సాయంత్రానికి తమ అంచనాలను చెప్పడానికి సిద్ధమవతుఉన్నాయి. పలు ఏజెన్సీలు తాము చేసిన అధ్యయనాల ఆధారంగానే ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తాయి. ఓటు వేసి వచ్చిన వారిలో చాలా మంది తాము ఫలానా పార్టీకి వేశామని చెప్పరు. అలాంటప్పుడు ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఎంత వరకు అక్యురేట్‌గా ఉన్నాయో చూద్దాం. దేశ పజలు మరోసారి మోదీకి పట్టం కట్టబోతున్నారని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. ఫలితాలు అదే విధంగా వచ్చాయి. 2019లో ఎన్నికల్లో మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్‌.డి.ఎ కూటమికి 352 సీట్లు వచ్చాయి. ఒక్క బీజేపీనే 303 స్థానాలను గెల్చుకుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఎ 90 సీట్లు గెల్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న 80 స్థానాలకుగాను ఎన్‌.డి.ఎ. కూటమి 49 సీట్లను గెల్చుకుంటుందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పాయి. అయితే ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఎన్‌డీయేకు 64 స్థానాలు వచ్చాయి. రాయబరేలీ స్థానం సమాజ్‌వాదీపార్టీకి దక్కింది. ఎగ్జిట్ పోల్స్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లకు 29 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు మాత్రమే లభించే అవకాశం ఉందని ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పింది. 2014లో జరిగిన ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలలో ఎన్‌టిఏ కూటమి 73 స్థానాలు గెల్చుకుంది. ఇందులో 71 స్థానాలు బీజేపీవే! రెండు స్థానాలు అప్నాదళ్‌కు లభించాయి. మరి ఈసారి ఏం జరగబోతున్నదో!

Updated On 1 Jun 2024 3:16 AM GMT
Ehatv

Ehatv

Next Story