కేరళలో ప్రగతిశీల భావాలు ఎక్కువ! మలయాళీలు ముందుయుగం దూతల్లాంటివారు. మిగతావారికంటే రెండు దశాబ్దాలు ముందుంటారు. అందుకే కేరళ తరచూ వార్తల్లోకి వస్తుంటుంది.
Gender-Neutral Toilets At Maharaja College Kerala, trigger social media debateకేరళ(Kerala)లో ప్రగతిశీల భావాలు ఎక్కువ! మలయాళీలు(Malayalis) ముందుయుగం దూతల్లాంటివారు. మిగతావారికంటే రెండు దశాబ్దాలు ముందుంటారు. అందుకే కేరళ తరచూ వార్తల్లోకి వస్తుంటుంది. వివాదాలు కూడా ఎక్కువే! ఇప్పుడు కూడా కేరళలో ఉన్న జెండర్ ఫ్రెండ్లీ టాయిలెట్ల(Gender-Friendly Toilets) అంశంపై దేశంలో పెద్ద చర్చే జరుగుతుంది. ప్రభుత్వ మహారాజా కాలేజీ ఆవరణలో చాలా ఏళ్లుగా ఉంటున్న లింగ నిర్ధారణ టాయిలెట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కొందరు దీన్ని సపోర్ట్ చేస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. జెండర్ ఫ్రెండ్లీ టాయిలెట్లు అంటే లింగభేదం లేకుండా వాటిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చన్నమాట! పురుషులకు ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా అక్కడ టాయిలెట్లు లేవు. మెజారిటీ ప్రజలు దీనికి ప్రగతిశీల చర్యగా ప్రశంసిస్తున్నారు. కొందరు మాత్రం పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు. 2018 నుంచి ఈ కాలేజీ క్యాంపస్‌లో జెండర్-ఫ్రెండ్లీ టాయిలెట్లు ఉన్నాయి. క్యాంపస్‌లోని వివిధ అధ్యయన విభాగాలలో 30కి పైగా టాయిలెట్లు జెండర్-ఫ్రెండ్లీగా ఉన్నాయని కాలేజీ అధికారులు తెలిపారు. మన ఇళ్లలో స్త్రీలకు, పురుషులకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉంటాయా? ఉండవు కదా! మరి అలాంటప్పుడు కాలేజీ క్యాంపస్‌లో మాత్రం ఎందుకు ఉండాలి? విద్యార్థినీ విద్యార్థులు ఒకే టాయిలెట్‌ను ఉపయోగించడంలో తప్పు ఏముంది?' అని విద్యార్థి ప్రశ్నించాడు. దీని వల్ల కాలేజీకి చెడ్డపేరు రావడం తప్పించి మరేరకమైన ప్రయోజనం లేదని, ఉద్దేశపూర్వకంగానే కొందరు ఇలాంటివి చేస్తున్నారని ఓ విద్యార్థిని చెప్పింది. కాలేజీలోని ప్రతిస్థలం అందరికీ అందుబాటులో ఉండాలన్నదే తమ లక్ష్యమని, ప్రతి వ్యక్తిని లింగభేదం లేకుండా చూడాలన్నదే తమ అభిమతమని మహారాజా కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుజా అన్నారు.