ఆకాశంలో తరచూగా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటాయి. ఆకశంలో గ్రహనాలు(Planet), చంద్రుడు(Moon), బ్లూ మూన్‌(Blue Moon) ఇలా రకరకాల అద్భుతాలను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు నుంచి ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కారం కానుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా(Planetery Society Of India) ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కాంతివంతమైన ఉల్కాపాతాలు(Meteor showers) కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్(Raghunandan) వెల్లడించారు.

ఆకాశంలో తరచూగా ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటాయి. ఆకశంలో గ్రహనాలు(Planet), చంద్రుడు(Moon), బ్లూ మూన్‌(Blue Moon) ఇలా రకరకాల అద్భుతాలను మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు నుంచి ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కారం కానుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా(Planetery Society Of India) ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కాంతివంతమైన ఉల్కాపాతాలు(Meteor showers) కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్(Raghunandan) వెల్లడించారు. అయితే ఇవి వేర్వేరు సమయాల్లో వేర్వేరు కాంతుల్లో దర్శనమిస్తాయని చెప్పారు. పాథియాన్‌ అనే గ్రహశకలం భూకక్ష్యలోకి ప్రవేశించిందని తెలుపుతూ.. ఇతర పదార్థాలతో రాపిడికి గురై ఉల్కలు ఏర్పడుతాయని ఆయన అన్నారు. చిన్న చిన్న ఉల్కలుగా రాలుతూ భూమిపై పడుతాయని.. ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని ఐఎంఓ వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలే కాకుండా పట్టణాలు, నగరాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని చెబుతున్నారు. వీటిని వీక్షించిన వారు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీస్తే తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయవచ్చని ఐఎంవో పేర్కొంది.

Updated On 16 Dec 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story