సలక్షణమైన కుర్రాడు తారసపడితే కూతురున్న ఏ తండ్రికైనా అల్లుడిని చేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే దానికో పద్దతి పాడు ఉంటుంది. నచ్చాడు కదా అని బెదిరించో బాదేసో పెళ్లి(Marriage) చేయరు కదా! కానీ బీహార్‌లో(Bihar) ఇదే జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని(Teacher) కిడ్నాప్‌(Kidnap) చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కూతురుతో వివాహం జరిపించాడో వ్యక్తి. వైశాలి(Vaishali) జిల్లాలో జరిగిన ఈ వింత పెళ్లి గురించే ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు.

సలక్షణమైన కుర్రాడు తారసపడితే కూతురున్న ఏ తండ్రికైనా అల్లుడిని చేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే దానికో పద్దతి పాడు ఉంటుంది. నచ్చాడు కదా అని బెదిరించో బాదేసో పెళ్లి(Marriage) చేయరు కదా! కానీ బీహార్‌లో(Bihar) ఇదే జరిగింది. ఓ ఉపాధ్యాయుడిని(Teacher) కిడ్నాప్‌(Kidnap) చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కూతురుతో వివాహం జరిపించాడో వ్యక్తి. వైశాలి(Vaishali) జిల్లాలో జరిగిన ఈ వింత పెళ్లి గురించే ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే గౌతమ్ కుమార్(Gautham Kumar) అనే యువకుడు ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాసయ్యాడు. పటేపూర్‌లోని రేపురాలోని పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు . బుధవారం అతను స్కూలులో పాఠాలు చెబుతుండగా నలుగురైదుగురు వచ్చి బలవంతంగా ఎత్తుకెళ్లారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కూతురుతో బలవంతంగా వివాహం చేశారు. పెళ్లి చేసుకోనని చెప్పినందుకు గౌతమ్‌కుమార్‌పై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గౌతమ్‌కుమార్‌ కోసం వెతికే పనిలో పడ్డారు. గౌతమ్​ కుమార్​ కుటుంబసభ్యులకు మాత్రం రాజేశ్‌ రాయ్‌ అనే వ్యక్తిపైనే అనుమానం. అతడే తన కొడుకును ఎత్తుకెళ్లి కూతురు చాందినితో(Chandini) పెళ్లి చేసి ఉంటాడని పోలీసులతో చెప్పారు. కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు బీహార్‌లో పకడ్వా వివాహాలు(Pakadwa Vivah) ఎక్కువయ్యాయి. పకడ్వా వివాహం అంటే ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడమన్నమాట! లాస్టియర్‌ ఇలాగే అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేయడానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్‌ను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి బెగుసరాయ్‌లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు రివర్స్‌లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి.

Updated On 1 Dec 2023 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story