ఒక మనిషి పడే బాధలకు కారణం ఏమిటంటే..వెంటనే గత జన్మలో అతను చేసుకున్న పాప ఖర్మలని చెప్పస్తారు. అలాంటి పాప దోషాల నివారణకు అనేక ప్రయత్నాలు చేస్తాం. పాపం పోగొట్టుకోవాలని దేవాలయాలకు వెళ్తాం. అలాగే జ్యతిష్య(Astrology) సిద్ధాంతులు చెప్పే పరిహారాల కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేస్తాం. రకరకాల దానాలతో కూడా పాపాలు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ..ఈ వ్యయ ప్రయాస అక్కర్లేకుండానే పాపాలు పోగొట్టుకునే మార్గం ఒకటుంది. నేరుగా ఆ ఆలయానికి వెళ్తేసరి..పాపాలు పోగొట్టడే కాకుండా..పోయినట్లు ఓ సర్టిఫికేట్(Certificate) కూడా ఇచ్చేస్తారు. వినడానికి షాకింగా ఉన్నా..ఇది నిజం. ఇంతకూ ఈ ఆలయం(temple) ఎక్కడుందో తెలుసుకుందాం రండి..

దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయంపై భక్తులకు ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంటుంది. కొన్ని ఆలయాల్లో మొక్కలు చెల్లిస్తే సంతానం కలుగుతుందని..మరికొన్ని చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహిస్తే..పెళ్లికాని వారికి..వెంటనే వివాహం(Marriage) అవుతుందని చెబుతుంటారు. ఇలా రకరకాల ఆలయాలు.. వాటి విశేషాల గురించి విని ఉన్నాం. కానీ ఇలాంటి ఆలయం గురించి వినే ఉండే అవకాశమే లేదు. ఇలాంటి ఆలయాలు కూడా ఉన్నాయా?.. అని షాకవుతాం. అలాంటి ఆలయమే ఒకటి రాజస్థాన్‌లోని(Rajasthan) ప్రతాప్‌గఢ్‌లో(Pratapgarh) ఉంది. శతాబ్దాలుగా తీర్థయాత్రలకు ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయం. దీనిని గిరిజనుల హరిద్వార్‌(Haridwar) అని, గౌతమేశ్వర్ మహాదేవ్ పాపమోచన(Gautameshwar Mahadev) తీర్థంగా పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు పాపం పోయినట్లు ధ్రువీకరణ పత్రాలు(Certificate) ఇచ్చే ఆచారం ఈ ఆలయంలో ఉంది. ఇక్కడున్న మందాకిని పాప మోచిని గంగాకుండ్‌(Gangakund) అనే రిజర్వాయర్‌లో స్నానం చేస్తే సర్వపాపాలు పోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ గుడిలో కేవలం 12 రూపాయలు చెల్లించి స్నానం చేస్తే చాలు..పాప విమోచన పత్రం ఇచ్చేస్తారు.

వివిధ రాష్ట్రాల చెందిన ప్రజలు..చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడికి వస్తుంటారని ఆలయ పూజారులు చెబుతున్నారు. పాపం చేశామన్న భావమే ఆయా భక్తులను ఇక్కడకు రప్పిస్తుంటుందన్నది అక్కడి పూజారి చెబుతున్న మాట. వ్యవసాయం చేస్తున్నప్పుడూ తెలిసో తెలియక మనవల్ల కొన్ని రకాల సరీసృపాలు, కీటకాలు చనిపోతాయి. దీని వల్ల కూడా ​ఒక జీవిని బాధించిన పాపం మనలని వెంటాడుతుంది. అలాంటి వారికి పాప విమోచర ధృవీకరణ పత్రం కూడా ఇస్తామంటున్నారు ఆలయ పూజారులు.

ప్రతి ఏడాది ఈ గౌతమేశ్వరాలయంలో దాదాపు 250 నుంచి 300 దాక పాప విమోచన ధృవీకరణ పత్రాలు ఇవ్వడం ఇక్కడ సాధారణ విషయమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గౌతమేశ్వరాలయంలో ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. మొత్తానికి కేవలం పాపపరిహారం కోసమేగాకుండా..ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు కూడా వేలాదిగా భక్తులు తరలి వస్తారన్నది ఆయల పూజారులు చెబుతున్నారు.

Updated On 15 Dec 2023 6:56 AM GMT
Ehatv

Ehatv

Next Story